ఈ కారం పొడులు రుచే వేరుగా..?

Suma Kallamadi
ఈ రకం కారం పొడులు మీ వంట ఇంట్లో కనుక ఉంటే కూరలు మంచి ఘుమ ఘమలు ఆడతాయి. బయట దొరికే కారం పొడిలలో ఏమేమి కలుపుతారో మనకి తెలియదు. అలాగే అవి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందుకే ఇండియా హెరాల్డ్ వారు ఇంట్లోనే రసం పొడి, కొబ్బరి పొడి ఎలా తయారు చేయాలో మీకు వివరించబోతున్నారు.
రసం పొడి :
కావాల్సిన పదార్ధాలు:
1 cup ధనియాలు
1/4 cup జీలకర్ర
1/4 cup కందిపప్పు
1/4 cup మిరియాలు
15 ఎండు మిర్చి
1/4 cup కరివేపాకు
విధానం
అడుగు మందంగా ఉన్న మూకుడులో ముందుగా ధనియాలు వేసి కేవలం లో-ఫ్లేం మీద మాత్రమే మాంచి సువాస వచ్చేదాకా అంటే రంగు మారేంత వరకు వేపుకోండి.తరువాత మిగిలిన పదార్ధాలు అన్నీ ఒక్కొటిగా వేసుకుంటూ లో-ఫ్లేం మీద వేపుకుని తీసి చల్లార్చుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా ఆకులోని చెమ్మ పోయే దాక వేపుకుని తీసి చల్లార్చుకోండి
పూర్తిగా చల్లారాక కాస్త బరకగా పొడి చేసుకోండి.ఈ పొడి ని రసం, సాంబార్,చారు లో వేస్తె మంచి రుచి వస్తుంది.
కొబ్బరి పొడి :
కావాల్సిన పదార్ధాలు
250 gms ఎండు కొబ్బరి ముక్కలు
15 ఎండు మిరప కాయలు
7 - 8 వెల్లులి
1 tsp జీలకర్ర
ఉప్పు
 తయారీ విధానం :
ఎండు కొబ్బరి ముక్కలు మూకుడులో వేసి లో-ఫ్లేం మీద ముక్కల్లోంచి నూనె కనిపించేంత వరకు కలుపుతూ లో-ఫ్లేం మీద వేపుకోవాలి. తరువాత ఎండు మిర్చి కూడా వేసి మరో 2-3 నిమిషాలు లో-ఫ్లేం మీద వేపుకోండి. తరువాత దింపి పూర్తిగా చల్లారచ్చండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి చల్లారిన కొబ్బరి ఎండుమిర్చీ, ఇంకా వెల్లులి, జీల కర్ర, ఉప్పు వేసి మెత్తని పొడి గా చేసుకోండి.దీన్ని సీసాలో ఉంచుకుంటే కనీసం నెల రోజులు నిలవుంటుంది.మరి ఒక సారి ట్రై చేసి చూడంండి. కూరలు చాలా రుచికరంగా ఉంటాయి



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: