రుచికరమైన నువ్వుల పులావు ఇలా తయారు చేయండి..!

Suma Kallamadi
చాల మంది ఎక్కువగా బయటి ఫుడ్ తినడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే బయటి ఫుడ్ తినడం వలన అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొంతమంది బయట తినే ఫుడ్ ని ఇంట్లోనే తాయారు చేయడానికి ట్రై చేస్తుంటారు. అలాగే ఇంట్లోనే రుచికరమైన నువ్వుల పులావు ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూద్దామా.
నువ్వుల పులావుకు కావాల్సిన పదార్దాలు:
మినప్పప్పు - ఒక టేబుల్ ‌స్పూన్‌, శనగపప్పు - ఒక టేబుల్ ‌స్పూన్‌, ఎండుమిర్చి - మూడు, కరివేపాకు - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - రెండు, నువ్వులు - మూడు టేబుల్ ‌స్పూన్లు, జీలకర్ర - అర టీస్పూన్‌, ఎండుకొబ్బరి - రెండు టేబుల్ ‌స్పూన్లు, నూనె - సరిపడా, ఆవాలు - పావు టీస్పూన్‌, ఇంగువ - చిటికెడు, ఉప్పు - తగినంత, బియ్యం - ఒకటిన్నర కప్పు.
ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి అన్నం వండి సిద్ధంగా పెట్టుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా పొడిపొడిగా ఉండేలా చూసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నువ్వులు, జీలకర్ర, ఎండుకొబ్బరి వేసి కలపాలి. కాసేపు వేగించి దింపాలి. అవి చల్లారిన తరువాత మిక్సీ జాడులోకి వేసి పొడి చేసుకోవాలి.
ఇక ఇప్పుడు స్టవ్‌ పై మళ్లీ పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె కొంచెం వేడి అయ్యాక ఆవాలు, మినప్పప్పు, ఎండు మిర్చి వేసి వేగించాలి. మినప్పప్పు వేగిన తరువాత కరివేపాకు, ఇంగువ వేసుకుని దింపాలి. ఇక ఇందులో నువ్వుల పొడి, తగినంత ఉప్పు వేయాలి. వండి అన్నం తీసుకుని అందులో ఈ మిశ్రమం కావలసినంత వేసుకుని కలపాలి. ఈ రుచికరమైన ఈ నువ్వుల పులావును ఇతర కూరలతో లేదా పెరుగుతో సర్వ్‌ చేయాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: