డిజిటల్ పేమెంట్లు చేసే వారికి గుడ్ న్యూస్.. యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు పంపొచ్చు!

Suma Kallamadi
దేశవ్యాప్తంగా చిన్న చిన్న పేమెంట్లు కూడా డిజిటల్ పద్ధతిలో ప్రజలు చేస్తున్నారు. టీ షాపు నుంచి జ్యువెలరీ షాపు వరకు పేమెంట్లు అన్నీ యూపీఐ ద్వారా సాగుతున్నాయి. యూపీఐ చెల్లింపు ధోరణి చాలా వేగంగా పెరిగింది. అయితే యూపీఐ ద్వారా చేసే పేమెంట్లకు కొంత వరకు లిమిట్ ఉంటుంది. దీని వల్ల ఎక్కువ మొత్తంలో డబ్బు పంపాలనుకునే వారికి నిరాశ ఎదురవుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపు పరిమితి పెంచబడింది. పన్ను చెల్లింపు, హాస్పిటల్, ఎడ్యుకేషన్ సెంటర్, ఐపీఓ వంటి ప్రత్యేక కేటగిరీలలో ప్రతి లావాదేవీ పరిమితిని ప్రస్తుతం రూ.5 లక్షలకు పెంచింది. ఈ కొత్త పరిమితి 16 సెప్టెంబర్ 2024 నుండి అమలులోకి వచ్చింది. దీని కారణంగా పెద్ద లావాదేవీలు కూడా యూపీఐ ద్వారాఐ సులభంగా చేయవచ్చు.
ఇప్పుడు పన్ను చెల్లింపు కోసం, వినియోగదారులు యూపీఐ ద్వారా రూ.5 లక్షల వరకు చెల్లించే సౌకర్యం ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌సీపీఐ) ఇటీవల ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. ఇది మిలియన్ల కొద్దీ పన్ను చెల్లింపుదారులకు చాలా సహాయంగా ఉంటుంది. ఇక ఎన్‌సీపీఐ ఆగష్టు 24, 2024న ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది. యూపీఐ ఇప్పుడు ప్రముఖ చెల్లింపు వ్యవస్థగా మారిందని పేర్కొంది. కొన్ని రకాల చెల్లింపులకు ప్రతి లావాదేవీ పరిమితిని పెంచాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.

ఇప్పుడు పన్ను చెల్లింపుకు సంబంధించిన లావాదేవీల పరిమితిని రూ.5 లక్షలకు పెంచినట్లు ఈ సర్క్యులర్‌లో పేర్కొంది. సెప్టెంబర్ 15, 2024లోపు ఈ కొత్త పరిమితిని అమలు చేయాలని అన్ని బ్యాంకులు, చెల్లింపు సర్వీస్ ప్రొవైడర్లు, యూపీఐ యాప్‌లను ఎన్‌సీపీఐ ఆదేశించింది. సెప్టెంబర్ 16 నుండి, వినియోగదారులు పన్ను చెల్లింపు కోసం UPI ద్వారా రూ. 5 లక్షల వరకు చెల్లించగలరు. అంతేకాకుండా హాస్పిటల్స్‌లోనూ ఈ సదుపాయం అమల్లోకి వచ్చింది. ఆసుపత్రుల్లో ఒక్కోసారి పేషెంట్లు లక్షల రూపాయలు చెల్లిస్తుంటారు. దీంతో వారికి కూడా ఈ విషయంలో ఈ కొత్త సదుపాయం ఎంతో సహాయంగా మారనుంది. ఇక రోజూ కోట్లాది మంది ప్రజలు ఐపీఓ లావాదేవీలను చేస్తుంటారు. వారు కూడా రూ.5 లక్షల వరకు లావాదేవీలు చేసే వీలుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: