రెస్టారెంట్ మేనేజర్లకి అదిరిపోయే షాక్ ఇచ్చిన జొమాటో.. ఏంటంటే..?
ఈ రోజుల్లో ఫుడ్ డెలివరీ సర్వీసులు బాగా పాపులర్ అయ్యాయి. అయితే చాలామంది కస్టమర్లు చీప్ క్వాలిటీ ఫుడ్స్ తమకు డెలివరీ అవుతున్నాయని ఫిర్యాదులు చేస్తున్నారు. రేట్లు ఎక్కువగా ఉన్నావు ఫుడ్ మాత్రం వరస్ట్ గా ఉంటుందని అంటున్నారు అంతేకాదు యాప్స్ లో ఇమేజ్‌లు అనేవి చాలా చక్కగా కనబడుతున్నాయి కానీ నిజంగా వచ్చే డెలివరీలలో ఆహారాలు మాత్రం అంతా మంచిగా కనిపించడం లేదు. జొమాటో అనే ఫుడ్ డెలివరీ యాప్ ఈ విషయాన్ని గుర్తించింది. ఫుడ్ ఫోటోలు కృత్రిమ మేధతో తయారు చేసినవి అని, అవి మిస్లిడ్ చేసి ఆర్డర్ పెట్టేలా చేస్తున్నాయవి, అసలు ఆహారంలా లేవని కస్టమర్లు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ ఫిర్యాదుల తర్వాత, జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఈ ఏఐ జనరేటెడ్ ఫోటోలు తొలగిస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఫోటోలు చూసి ఆకర్షితులై ఆహారం ఆర్డర్ చేసిన కస్టమర్లు, వచ్చిన ఆహారం ఫోటోలో చూపించినట్లు లేకపోవడంతో చాలా బాధపడ్డారు. దీని వల్ల కస్టమర్లకు, రెస్టారెంట్ల మధ్య నమ్మకం పోతోంది. అంతేకాకుండా, కస్టమర్లు ఆర్డర్ చేసిన ఆహారాన్ని తిరిగి పంపించడం, రెస్టారెంట్ల రేటింగ్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. జొమాటో కంపెనీ చాలా విధాలుగా కృత్రిమ మేధను ఉపయోగిస్తుంది. కానీ ఆహారం ఫోటోల విషయంలో మాత్రం కృత్రిమ మేధను ఉపయోగించకూడదని జోమాటో సీఈఓ దీపిందర్ గోయల్ చెప్పారు.
జొమాటో కంపెనీ ఈ నెలాఖరులోగా ఆహారం మెనుల్లో కృత్రిమ మేధతో తయారు చేసిన ఫోటోలను తొలగించాలని నిర్ణయించుకుంది. అంతేకాకుండా, ఇకపై ఇలాంటి ఫోటోలను జొమాటోలో వాడకూడదని చెప్పింది. జొమాటోతో పనిచేసే రెస్టారెంట్లు, జొమాటో మార్కెటింగ్ టీమ్ కూడా కృత్రిమ మేధతో తయారు చేసిన ఫోటోలను వాడకూడదని దీపిందర్ గోయల్ కోరారు.
దీపిందర్ రెస్టారెంట్ యజమానులను నిజమైన ఆహారం ఫోటోలు తీయించుకోమని సలహా ఇచ్చారు. జొమాటో ఈ సర్వీసును ఉచితంగా అందిస్తుంది. రెస్టారెంట్ యజమానులు తమ మెనూలో ఉపయోగించే ఆహారం ఫొటోలు నిజంగా ఆహారంలా ఉండాలని జోమాటో కోరుకుంటుంది. అయితే ఇప్పటిదాకా కేవలం ఫోటోలతో కొత్త కస్టమర్లను ఆకర్షించిన రెస్టారెంట్ యజమానులు ఇకపై అలా చేయలేదు. సొంతంగా తయారు చేసే ఫుడ్ ఫోటో తీసి పెట్టాల్సి ఉంటుంది. క్వాలిటీ ఫుడ్స్ తయారు చేయలేని యజమానులకు ఇది పెద్ద షాకింగ్ విషయం అని చెప్పుకోవచ్చు.