మళ్ళీ పాత ప్లాన్లకి దిగొచ్చిన జియో?

frame మళ్ళీ పాత ప్లాన్లకి దిగొచ్చిన జియో?

Purushottham Vinay

టారిఫ్ పెంపుతో యూజర్లలో తీవ్ర అసంతృప్తిని మూటకట్టుకున్నది రిలయన్స్‌ జియో. ప్లాన్స్ పెంచడం వల్ల అంబాని పై సోషల్ మీడియాలో బాగా నెగటివిటీ పెరిగింది. దాంతో 5000 కోట్ల ఖర్చు పెట్టి తన కొడుకు పెళ్లి చేసిన అంబానిని జియో కస్టమర్స్ జియో ప్లాన్స్ పెంచడం కారణంగా తిట్టడం మొదలు పెట్టారు. దీంతో వారిని సంతృప్తి పరచడానికి జియో కంపెనీ కాస్త దిగివచ్చింది. అయితే పూర్తిగా అన్ని మార్చలేదు. కేవలం తన రూ.999 ప్రీపెయిడ్ ప్లాన్‌ని నిశ్శబ్దంగా తిరిగి ప్రవేశపెట్టింది జియో కంపెనీ.ఎక్కువ మంది రీచార్జ్‌ చేసుకునే రూ.999 ప్లాన్‌ ధరను జూలై 3న రూ.1,199కి జియో పెంచడం జరిగింది. అయితే తాజాగా కొన్ని సవరించిన ప్లాన్ ఫీచర్‌లు ఇంకా ప్రయోజనాలతో పాత ప్లాన్‌ను మళ్లీ అందుబాటులోకి తీసుకువచ్చింది.అయితే కొత్త రూ. 999 ప్లాన్‌లో అత్యంత ముఖ్యమైన మార్పు ఏమిటంటే, దాని పొడిగించిన వ్యాలిడిటీ. 

పాత ప్లాన్‌లో ఇది 84 రోజులు ఉండగా కొత్త ప్లాన్‌ 98 రోజుల వ్యాలిడిటీని జియో అందిస్తుంది. అంటే మొత్తం 14 రోజులు అదనపు వ్యాలిడిటీ లభిస్తుందన్నమాట. కానీ రోజువారీ డేటాను మాత్రం కొత్త ప్లాన్‌లో తగ్గించడం జరిగింది. గత ప్లాన్‌లో రోజుకు 3GB డేటా లభిస్తుండగా కొత్త ప్లాన్‌ అయితే రోజుకు 2GB డేటాను అందిస్తుంది. ఈ డేటా పరిమితి తగ్గినప్పటికీ దీంతో 5జీ డేటాను ఆనందించవచ్చు. ఇక రోజుకు 100 SMSలు ఇంకా అపరిమిత వాయిస్ కాలింగ్ ఫీచర్లు ఉన్నాయి.అయితే దీనికి పోటీగా ప్రత్యర్థి టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ కూడా రూ.979 ప్లాన్‌ను అందిస్తోంది. ఈ ప్లాన్ మొత్తం 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ ఇంకా రోజుకు 100 SMSలను అందిస్తుంది. అలాగే అపరిమిత 5g డేటాను కూడా ఆనందించవచ్చు. ఇక ఎయిర్‌టెల్ ప్లాన్ అందించే అదనపు ప్రయోజనం ఏమిటంటే, 56 రోజుల పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ తీసుకోవచ్చు. ఏది ఏమైనా టెలికాం కంపెనీలు ఇలా రీఛార్జ్ లు పెంచడం వలన జనాల్లో వ్యతిరేకత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: