ఇన్సూరెన్స్ పాలసీస్: కొత్త రూల్స్.. జాగ్రత్తగా చదవండి?

Purushottham Vinay
మన దేశంలో బీమా పాలసీలు కొనుగోలు చేసే సమయంలో కస్టమర్‌లు ఫీచర్లు, ఇతర నిబంధనలు, షరతులను అర్థం చేసుకోవడంలో కొంత గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. అందువల్ల పాలసీదారులు మొత్తం పత్రాన్ని క్షుణ్ణంగా చదవడం మానేస్తున్నారు. ముఖ్యంగా పాలసీలోని నిబంధనలు చిన్న అక్షరాలతో పేర్కొనడం వల్ల చాలా మంది వాటిని చదవడానికి ఇష్టపడడం లేదు. ఇంకా అలాగే సింపుల్‌గా చదివనట్లు ధ్రువీకరిస్తూ సంతకం కూడా చేసేస్తున్నారు. అయితే ఈ బీమా పాలసీ ప్రాథమిక లక్షణాలను సాధారణ పదాల్లో, కస్టమర్‌ ఇన్ఫర్మేషన్‌ షీట్‌లో అందించిన ముందే నిర్వచించిన ఫార్మాట్‌లో జాబితా చేయాలని బీమా సంస్థలకు బీమా నియంత్రణ సంస్థ అయినా ఐఆర్‌డీఏఐ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఐఆర్‌డీఏఐ ఆదేశించిన తాజా నిబంధనల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.



సీఐఎస్‌కు సంబంధించిన సవరించిన ఫార్మాట్ వచ్చే ఏడాది జనవరి 1 వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. ఈ పాలసీకి సంబంధించిన అన్ని సంబంధిత సమాచారాన్ని కలిగి ఉన్న అప్డేట్ చేసిన సీఐఎస్‌ను బీమా సంస్థలు పంపాలని రెగ్యులేటర్ నిర్దేశించారు. నిజానికి బీమాదారు, పాలసీదారుల మధ్య సమాచారానికి సంబంధించిన అసమానతకు సంబంధించి అనేక ఫిర్యాదులు అందాయి. పాలసీదారుల అవగాహనను పెంపొందించడం ఇంకా పారదర్శకతను పెంపొందించడం కోసం తాజా నియమాలను రూపొందించారు. బీమా ఉత్పత్తి పేరు, పాలసీ నంబర్, బీమా ఉత్పత్తి రకం, బీమా మొత్తం, పాలసీ కవరేజీ, మినహాయింపులు, నిరీక్షణ కాలం, కవరేజీ ఆర్థిక పరిమితులు, క్లెయిమ్‌ల విధానం ఇంకా అలాగే పాలసీ సర్వీసింగ్, వంటి వివరాలను ముందే నిర్వచించిన ఫార్మాట్‌లో కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్ కలిగి ఉంటుంది. ఇక బీమాదారులు సీఐఎస్‌కు సంబంధించిన వివరాలను గమనించి, అందుకున్నారని నిర్ధారిస్తూ పాలసీదారుల రసీదుని కూడా ఖచ్చితంగా తీసుకోవాలి.ఆరోగ్య బీమాలోని సీఐఎస్‌ పాలసీదారులకు వారి ఆరోగ్య బీమా పాలసీకి సంబంధించిన అన్ని ముఖ్యమైన సమాచారాన్ని సరళమైన భాషలో అందించడానికి రూపొందించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: