UPI : క్రెడిట్‌ కార్డుతో లింక్ చేసే ఛాన్స్?

Purushottham Vinay
ఇక మన దేశంలో డిజిటల్‌ చెల్లింపులు అనేవి చాలా భారీగా పెరిగాయి. కరోనా పాండమిక్ తరువాత వచ్చిన పరిస్థితుల నేపథ్యంలో దేశంలో డిజిటల్‌ చెల్లింపులు బాగా ఊపందుకున్నాయి.అలాగే డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌ మధ్య పెరిగిన పోటీ కూడా వీటి ఉపయోగం పెరగడానికి చాలా కారణాలుగా చెప్పొచ్చు.ఇక యూజర్ల అవసరాలకు అనుగుణంగా డిజిటల్‌ వ్యాలెట్స్‌లో అనేక రకాల మార్పులు వస్తున్నాయి. ఇక తాజాగా డిజిటల్ పేమెంట్స్‌ను బాగా పెంచేందుకు  కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇప్పటి దాకా డిజిటల్‌ వ్యాలెట్స్‌కు కేవలం డెబిట్ కార్డులను మాత్రమే లింక్‌ చేసుకునే ఛాన్స్ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా క్రెడిట్‌ కార్డులను కూడా లింక్‌ చేసుకునే వెసులుబాటుని కల్పిస్తున్నారు.తాజాగా కొటక్ మహీంద్ర బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ సేవల ఫెసిలిటీని కల్పించనుంది. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న మొదటి బ్యాంకుగా నిలిచింది కొటక్‌ మహీంద్ర.


కోటక్ మహీంద్రా బ్యాంక్ కస్టమర్లు క్రెడిట్ కార్డు ద్వారా యూపీఐ చెల్లింపులని చేయవచ్చు. క్రెడిట్ కార్డు కలిగిన కస్టమర్లు రోజువారీ యూపీఐ సేవలు కార్డుని లింక్ చేసుకోవచ్చు.అయితే కోటక్ మహీంద్ర రూపే క్రెడిడ్ కార్డ్ హోల్డర్లకు మాత్రమే ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు. బీమ్, పేటీఎం, ఫోన్ పే, ప్రీఛార్జ్ ఇంకా పేజాప్‌తో సహా కొన్ని యూపీఐ యాప్‌లతో ఈ సర్వీసెస్ పొందవచ్చు.క్రెడిట్‌ కార్డులను డిజిటల్‌ వ్యాలెట్‌తో కనుక మీరు లింక్‌ చేసుకుంటే యూపీఐ ద్వారా చేసే పేమెంట్స్‌ మొత్తం కూడా క్రెడిట్ కార్డు నుంచి కట్ అవుతాయి. ప్రస్తుతం ఈ సేవలు కోటక్‌కు పరిమితం కాగా త్వరలో ఇతర బ్యాంకులు కూడా ఈ సేవలను అందుబాటులోకి తీసుకు రానున్నాయి. క్రెడిట్‌ కార్డును యాప్‌తో లింక్‌ చేసకోవాలంటే ముందుగా మీరు యాప్ ఓపెన్ చేసి లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత యాడ్ అకౌంట్ క్లిక్ చేసి క్రెడిట్ కార్జు ఆప్షన్ క్లిక్ చేయాలి. క్రెడిట్ కార్డు ఎంచుకున్న తరువాత మొబైల్ నెబర్, క్రెడిట్ కార్డు చెల్లుబాటు ఇంకా ఇతర వివరాలని ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ చేసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

UPI

సంబంధిత వార్తలు: