క్రెడిట్ కార్డు బిల్లు సకాలంలో చెల్లించకపోతే...?

Purushottham Vinay
మనలో చాలా మంది కూడా సకాలంలో క్రెడిట్ కార్డు వాయిదాలు సరిగ్గా చెల్లించలేకపోతారు. రిజర్వు బ్యాంకు రూల్స్ ప్రకారం వాయిదా చెల్లించడం మూడు రోజుల కంటే ఆలస్యమైతేనే ఆ బ్యాంకులు లేదా కంపనీలు ఆలస్య రుసుమును విధిస్తాయి. క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లో ఉన్న విధంగా, చెల్లింపు గడువు దాటిన తరువాత నుంచి మాత్రమే అపరాధ రుసుము విధించాలని రిజర్వు బ్యాంకు రూల్స్ చెబుతున్నాయి. అయితే చాలా మందిలో కూడా ఖచ్చితంగా ఓ డౌట్ ఉంటుంది. క్రెడిట్ కార్డు వాయిదా (ఈఎంఐ) ఏదైనా ఒక నెల కనుక కట్టకపోతే మనం తీసుకున్న లోన్ మొత్తానికి ఫెనాల్టీ పడుతుందా అని డౌట్ ఉంటుంది. ఇక రిజర్వు బ్యాంకు రూల్స్ ప్రకారం ఆ నెలలో కట్టాల్సిన వాయిదా మొత్తం ఎంతయితే ఉంటుందో దానికి మాత్రమే అపరాధ రుసుము లేదా లేట్ ఫీజు విధించాల్సి ఉంటుంది.రిజర్వు బ్యాంకు గైడ్లైన్స్ ప్రకారం నిబంధలు పాటించే బ్యాంకులు ఇంకా సంస్థలు ఓ వ్యక్తి చెల్లించకపోయిన నెల వాయిదా మొత్తం మీద మాత్రమే లేట్ ఫీజుని విధిస్తాయి.


లేట్ ఫీజు విషయంలో కూడా కొన్ని నిబంధనలు ఉన్నాయి. క్రెడిట్ కార్డు జారీ చేసిన సమయంలో EMI కట్టడంలో విఫలమైతే ఎంత లేట్ ఫీజు విధిస్తారనేది స్పష్టం చేస్తారు. ఆ విధంగా మాత్రమే ఛార్జీలు అనేవి వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ లేట్ ఫీజు లేదా వడ్డీల్లో ఏవైనా మార్పులు చేసినా ఇంకా రేట్లను పెంచినా క్రెడిట్ కార్డు వినియోగదారుడుకి ఒక నెల రోజుల ముందు నోటీసు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నోటీసు ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ ఛార్జీలను చేంజ్ చేయగలరు. ఒక వేళ బ్యాంకులు లేదా ఏవైనా కంపెనీలు విధించిన ఛార్జీలు ఎక్కువుగా ఉన్నాయని అలాగే రీజనబుల్ గా లేవని భావిస్తే అన్ని బకాయిలు అనేవి చెల్లించిన తర్వాత క్రెడిట్ కార్డ్‌ని సరెండర్ చేయవచ్చు. అలా క్రెడిట్ కార్డును వదులుకున్నప్పుడు ఎటువంటి ఎక్సట్రా చార్జీలను విధించకూడదు. అలా కనుక విధిస్తే రిజర్వు బ్యాంకు రూల్స్ ని ఉల్లంఘించినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: