రేషన్ కార్డ్ ఉన్నవారికి శుభవార్త?

Purushottham Vinay
ఇక రేషన్ కార్డుదారులకు త్వరలోనే మంచి శుభవార్త అందే అవకాశం ఉంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనను పథకాన్ని పొడగించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. కొత్త సంవత్సరంలో పీఎంజీకేఏవై పథకాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ పథకం వల్ల లబ్ధిదారులకు ప్రతి నెలా కూడా 5 కిలోల ఉచిత ఆహార ధాన్యాలు అందుతాయి. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ) ప్రకారం వారికి అత్యంత సబ్సిడీ ధరకు ఇచ్చే పరిమాణానికి ఇది అదనం అవుతుంది. కరోనా లాక్ డౌన్  నుంచి పేదలను ఆదుకునేందుకు ఏప్రిల్ 2020 వ సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా ఈ పథకం ప్రారంభించినప్పటి నుంచి ప్రజలకు ఉచితంగా ఆహార ధాన్యాలు కూడా అందజేస్తోంది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోసం మొత్తం కూడా 3.9 లక్షల కోట్ల రూపాయల సబ్సిడీ ఖర్చు అవుతుందని కేంద్రం అంచనా వేసింది. ఈ పథకాన్ని మార్చి 2023 దాకా పొడిగిస్తే సబ్సిడీ బిల్లుకు మరో రూ.40 వేల కోట్లు అదనంగా ఖర్చు అవుతుందని వర్గాలు తెలిపాయి.

అయితే ఈ స్కీం కొనసాగించడం ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఇక ఆర్థిక భారం కూడా ఒక అంశం అయితే.. ఆ అవసరాలకు సరిపడా గోధుమ నిల్వలు లేకపోవడం చాలా ఇబ్బందిగా మారనుంది.ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ ఇంకా అలాగే ఇతర సంక్షేమ పథకాల కేటాయింపుతోపాటు పీఎంజీకేఏ కోసం అదనపు అవసరాలకు సరిపడా గోధుమలు కూడా ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది.ఇక కేంద్ర ప్రభుత్వ అంచనా ప్రకారమైతే జనవరి 1, 2023 వరకు సెంట్రల్ పూల్‌లో  మొత్తం 159 లక్షల టన్నుల గోధుమలు అందుబాటులో ఉంటాయి. PMGKAYని మార్చి నెల దాకా కనుక పొడిగిస్తే.. జనవరి 2023 నుంచి మార్చి 2023 మధ్య మరో 68 లక్షల టన్నుల గోధుమలను పంపిణీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలపడం జరిగింది. దీంతో ఏప్రిల్ 1 వ తేదీ దాకా ప్రభుత్వం వద్ద మొత్తం 91 లక్షల టన్నుల గోధుమలు  ఉండనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: