FD: అధిక వడ్డీ ఇచ్చే బ్యాంక్స్ ఇవే?

Purushottham Vinay
అధిక వడ్డీ ఇస్తూ ఫిక్స్ డ్ డిపాజిటర్ లను ఆకర్షి్ంచేందుకు బ్యాంకులు కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వరుసగా రెపో రేటు పెంచిన నేపథ్యంలో బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఇటీవల పెంచిన బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఓబి), హెచ్ డిఎఫ్ సి, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐడిఎఫ్ సి ఫస్ట్ బ్యాంక్ ఉన్నాయి. వీటిలో ప్రధానమైన బ్యాంకులు ఎలాంటి వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కెనరా బ్యాంక్ 666 రోజుల కాలవ్యవధి కోసం ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ ప్రకారం, బ్యాంకు తన ఖాతాదార్లకు 7% వడ్డీ రేటును అందిస్తోంది, సీనియర్ సిటిజన్లు ఈ డిపాజిట్లపై 7.5% వడ్డీ పొందవచ్చు.బ్యాంక్ ఆఫ్ ఇండియా (బివోఐ) అధిక వడ్డీ రేట్లను అందించే ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌తో ముందుకు వచ్చింది.


‘స్టార్ సూపర్ ట్రిపుల్ సెవెన్ ఫిక్స్‌డ్ డిపాజిట్’ పథకాన్ని ప్రకటించింది, ఇది పరిమిత కాల ఆఫర్ కాగా, పేరుకు తగినట్లుగా కొత్తగా ప్రారంభించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ కాలవ్యవధి 777 రోజులు. మామూలు ఖాతాదారులకు డిపాజిట్‌పై 7.25% సీనియర్ సిటిజన్‌లకు 7.75% వరకు వడ్డీ రేటును ఈ బ్యాంకు అందిస్తుంది.బ్యాంక్ ఆఫ్ బరోడా (బిఓబి) 399 రోజుల బరోడా తిరంగా ప్లస్ డిపాజిట్ పథకాన్ని ప్రారంభించింది. ఈ డిపాజిట్‌పై 6.75 శాతం వడ్డీ ఇస్తున్నట్లు తెలిపింది. సీనియర్‌ సిటిజన్లకు 7.25 శాతం వడ్డీ వర్తిస్తుంది. మధ్యలో వెనక్కి తీసుకోవడానికి వీల్లేని నాన్‌-కాలబుల్‌ డిపాజిట్లపై 7.00 శాతం వడ్డీ ప్రకటించింది. వయోధికులకు అర శాతం అధిక వడ్డీ చెల్లిస్తుంది. దీంతోపాటు అన్ని కాల వ్యవధుల డిపాజిట్లపై 10 బేసిస్‌ పాయింట్ల మేరకు వడ్డీ పెంచినట్లు తెలిపింది. 444 రోజుల ప్రత్యేక డిపాజిట్‌పై 6 శాతం, 555 రోజుల వ్యవధి డిపాజిట్కు 6.25 శాతం చొప్పున వడ్డీని ఇస్తున్నట్లు ప్రకటించింది. పెంచిన వడ్డీ రేట్లు ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: