లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) పట్ల ప్రజలకు నమ్మకం చాలా ఎక్కువ. ఈ ఇన్సూరెన్స్ సంస్థ ఎప్పటి నుంచో కూడా ఎన్నో రకాల సేవలు అందిస్తుంది.ప్రభుత్వ మద్దతు గల ఈ కంపెనీ అనేక రకాల పాలసీలను కూడా తీసుకొచ్చింది.ఇక అలాంటి పాలసీల్లో ఎల్ఐసీ జీవన్ లాభ్ ఒకటి. ఈ పాలసీలో రోజుకు రూ.253 డిపాజిట్ చేయడం ద్వారా మొత్తం రూ.54.50 లక్షలు వరకు కూడా ప్రయోజనం పొందవచ్చు. ఎల్ఐసీ జీవన్ లాభ్ ప్లాన్ లాభం ఇంకా రక్షణ రెండింటిని అందిస్తోంది. ఇక ఈ పాలసీ తీసుకోవాలంటే 8 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారు తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ వచ్చేసి 16 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. అయితే కనీసం రూ.2 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ కూడా ఏదీ లేదు. ఇక మీకు రూ.54.50 లక్షలు రావాలంటే మీరు రోజుకు రూ. 253 చొప్పున 25 ఏళ్లపాటు పొదుపు చేయాలి. మీకు 25 సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే, 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి కోసం lic జీవన్ లాభ్ బీమాను కొనుగోలు చేసినట్లయితే ఇక మీరు మెచ్యూరిటీ సమయంలో అంటే 50 ఏళ్లకు రూ. 54.50 లక్షల వరకు పొందవచ్చు. ఇంకా అలాగే lic జీవన్ లాభ్ పాలసీ అనేక రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. బేసిక్ సమ్ అష్యూర్డ్, వెస్టెడ్ సింపుల్ రివర్షనరీ బోనస్లు ఇంకా ఆఖరి అదనపు బోనస్లు పాలసీ మెచ్యూరిటీపై ఒకేసారి చెల్లిస్తారు.
అలాగే పాలసీదారు మరణించిన పక్షంలో నామినీకి బీమా హామీ మొత్తాన్ని అందజేస్తారు. ఇది సంపూర్ణ హామీ మొత్తం కంటే కూడా ఏడు రెట్లు ఎక్కువ.ఇక ఈ పాలసీ తీసుకున్న వినియోగదారుడు మూడు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లింపుపై కూడా రుణ సదుపాయం అనేది పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తం ఇంకా బోనస్ వంటివి పొందవచ్చు.అలాగే ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. పాలసీదారుడి మరణంపై కూడా పన్ను మినహాయింపు అనేది పొందవచ్చు. పాలసీ కొనసాగుతున్న సమయంలో గానీ ఇంకా ఒక వేళ ప్రీమియంలు పూర్తిగా చెల్లించిన తర్వాత పాలసీదారుడు మరణించినా అతని నామినీ డెత్ సమ్ అస్యూర్డ్ ఇంకా సింపుల్ రివర్షనరీ బోనష్, డెత్ బెనిఫిట్స్ అదనంగా బోనస్ అందుకుంటారు. ఇక ఒక మాటలో చెప్పాలంటే పాలసీదారుడు మరణించినా అదనపు బీమా అనేది మొత్తం అందుతుంది. పిల్లల పెళ్లి, ఉన్నత చదువులు ఇంకా అలాగే ప్రాపర్టీ కొనుగోలు వంటి వాటికి ఈ పాలసీ అనుగుణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.