ప్రపంచంలో అత్యంత ఖరీదైన నాణెం ఇదే!

Purushottham Vinay
ఇక కొంతమందికి భిన్నమైన అలవాట్లు ఉంటాయి.రకరకాల పాత వస్తువులను సేకరించడం హాబీగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు.చాలా మంది కూడా పాత స్టాంపులను సేకరిస్తే, పాత నాణేలను సేకరించడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. అయితే ఇలాంటి హాబీలు వారికీ తెలియకుండానే వారిని పెద్ద లక్షాధికారులను చేస్తాయి. ఈరోజు అరుదైన నాణెం వచ్చేసి బిలియన్లు పలుకుతోంది. ఇక ఈ అరుదైన నాణెం విలువ మార్కెట్ లో వేలల్లో ఉంటే.. దాన్ని వేలం వేసినప్పుడు దీని విలువ చాలా ఎక్కువగా ఉంది. దీంతో ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం అయింది.ఇక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం డబుల్ ఈగిల్ గోల్డ్ కాయిన్. దీని మార్కెట్ విలువ ఇప్పుడు వేలల్లో ఉంది. అయితే దీనిని వేలానికి ఉంచినప్పుడు ప్రజలు దానిని కొనడానికి బిలియన్ల రూపాయలు ఖర్చు చేయడానికి రెడీగా ఉన్నారు. ఇది 1933 వ సంవత్సరంలో తయారు చేయబడిన ఒక అమెరికన్ నాణెం.ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెం ఇది.


ఇక ఈ నాణేన్ని వేలానికి మార్కెట్‌లోకి తీసుకువచ్చినప్పుడు రూ. 1,44,17, 95, 950 లకు అమ్ముడయ్యింది. అయితే మార్కెట్ ధర ప్రకారం దీని ధర దాదాపు పదహారు వందలు విలువైన నాణెం ఎందుకు ఇంత ఖరీదైనది అంటే.. నిజానికి ఈ నాణెం ఒక వైపున లేడీ లిబర్టీ ఆఫ్ అమెరికా చిత్రాన్ని కలిగి ఉంది. అలాగే మరోవైపు అమెరికన్ ఈగిల్ ముద్రించబడింది.అలాగే ఈ నాణెం గురించి అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ నాణెం తయారు చేయబడింది కానీ ఇది ఎప్పుడూ కూడా వినియోగంలోకి రాలేదు. ఈ నాణెం అమలులోకి వచ్చే సమయానికి అమెరికాలో బంగారు నాణేల తయారీని నిలిపివేశారు. దీని వల్ల ఇటువంటి బంగారు నాణాలను తయారు చేయడం నిలిపివేశారు. ఇక అంతేకాదు అప్పటికే తయారు చేసిన నాణేలను నాశనం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు కూడా ఇచ్చింది. అయితే కొన్ని రకాల కారణాల వల్ల ఈ నాణెం మనుగడలో ఉంది. ఇప్పుడు దీని విలువ వచ్చేసి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నాణెంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: