రుణాల‌పై హెచ్‌డీఎఫ్‌సీ కీల‌క ప్ర‌క‌ట‌న‌..! రుణ‌గ్ర‌హీత‌ల‌కు శుభవార్త..

Paloji Vinay
 పండుగ సీజ‌న్ వేళ ప్ర‌భుత్వం, ప్రైవేటు బ్యాంకులు, ఇత‌ర సంస్థ‌లు త‌మ వినియోగ‌దారుల‌కు ఎన్నో ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ క్ర‌మంలో దేశీయ‌ దిగ్గజ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( sbi ) మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులైన బ్యాంక్ ఆఫ్ బరోడా ( BOB ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ ( PNB ) దారిలోనే హెచ్‌డీఎఫ్‌సీ కూడా వెళ్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ తాజాగా రుణ గ్రహీతలకు అదిరిపోయే శుభ‌వార్త చెప్పింది. పండుగ సీజ‌న్ నేప‌థ్యంలో త‌మ క‌స్ట‌మ‌ర్ల‌కు తీపీ క‌బురు అందించింది. హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్‌. రుణ రేట్లు త‌గ్గిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించి రుణ‌గ్ర‌హీత‌ల‌కు ఊర‌ట క‌లిగించింది.


    ఈ రుణ రేట్లు కేవ‌లం హోమ్ లోన్స్‌కు మాత్రమే వ‌ర్తిస్తుంది. గృహ నిర్మాణం కోసం తీసుకున్న రుణంపై  వడ్డీ రేట్ల తగ్గింపు ఉంటుంది. దీంతో ఇప్పుడు రుణ గ్రహీతలు 6.7 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ తీసుకోవ‌చ్చు. అయితే, ఈ నిర్ణ‌యం సెప్టెంబ‌ర్ 20 నుంచే అమ‌లులోకి వ‌చ్చింద‌ని హెచ్‌డీఎఫ్ వెల్ల‌డించింది. అలాగే ఇది కేవ‌ల ప‌రిమిత కాలం ఆఫ‌ర్ మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. అయితే తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ పొందాలని భావించే వారు ఒక విషయం గ‌మ‌నించాల్సి ఉంటుంది.  క్రెడిట్ స్కోర్ ప్రాతిపదికన వడ్డీ రేట్లు మారతాయని గుర్తించాల్సి ఉంటుంది.


    2021 అక్టోబర్ 31 వరకు తక్కువ వడ్డీ రేటుకే అంటే 6.7 శాతం వడ్డీ రేటు ఆఫర్ అందుబాటులో కి వ‌చ్చింది.  అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన కోటక్ మహీంద్రా బ్యాంక్ 6.5 శాతం వడ్డీ రేటుకే హోమ్ లోన్స్ జారీ చేస్తోంది. ఎస్‌బీఐ బ్యాంక్ హోమ్ లోన్స్‌పై 6.7 శాతం వడ్డీ విధిస్తోంది. బ్యాంక్ ఆఫ్ బరోడాలో అయితే 6.75 శాతం వసూలు చేస్తోంది. ఇలా పండుగ సీజ‌న్ వేళ ఆయా బ్యాంకులు ఆఫ‌ర్లు ప్ర‌క‌టించ‌డంతో వినియోగ‌దారులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: