అయ్య బాబోయ్.. అంబానీ చీరలొస్తున్నాయి?
అయితే ముఖేష్ అంబానీ ఇప్పటికే ఎన్నో రకాల వ్యాపారాలు చేస్తున్నాడు. అంతేకాదు కనుమరుగైపోయిన రిలయన్స్ నెట్వర్క్ ను మళ్లీ తెర మీదికి తెచ్చాడు. రిలయన్స్ నెట్వర్క్ రూపురేఖలు మార్చేసి జియో అనే నెట్ వర్క్స్ అందుబాటులోకి తీసుకువచ్చి.. టెలికాం రంగంలో సంచలనం సృష్టించారు అని చెప్పాలి. తక్కువ సమయంలోనే దిగ్గజ టెలికాం రంగ సంస్థలుగా కొనసాగుతున్న వాటిని సైతం దాటుకుని నెంబర్ వన్ స్థానం లోకి చేరి పోయారు ముఖేష్ అంబానీ. ఇలా క్రమక్రమంగా ముఖేష్ అంబానీ తన వ్యాపారాలు సంఖ్య అంతకంతకూ పెంచుకుంటూ పోతున్నారు .
ఇక ఇప్పుడు మరో కొత్త వ్యాపారం లోకి కూడా అడుగు పెట్టబోతున్నారు ముఖేష్ అంబానీ. ఇక త్వరలో అంబానీ చీరలు వచ్చాయి అని ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లో భాగం అయినటువంటి రిలయన్స్ రిటైల్ ఈ వ్యాపారాన్ని చేపట్టబోతున్నారట. భారతీయ సాంప్రదాయ దుస్తువులు అమ్మకాల కోసం.. అవాంతర బ్రాండ్ పేరుతో కొత్తగా స్టోర్ మొదలు పెట్టాలని ప్రస్తుతం భావిస్తున్నారట. ఇక ఈ పండుగ సీజన్లో బెంగుళూరులో మొదటి స్టోర్ ఏర్పాటు చేసేందుకు కూడా ఇప్పటికే ప్లాన్ సిద్ధం చేసిందట. ఆ తర్వాత కర్ణాటక లోని కొన్ని ప్రాంతాల్లో.. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా స్టోర్లు ఏర్పాటు చేయబోతున్నారట. ఈ విషయాన్ని ఇటీవలే ఒక జాతీయ మీడియా ప్రచురించింది. తనిష్క్, ఆదిత్య బిర్లా బ్రాండ్ కు పోటీగా ఇక అవాంతర అనే కొత్త బ్రాండ్ ను తీసుకు వచ్చేందుకు ముఖేష్ అంబానీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.