బ్యాంక్ ప‌నులుంటే ఈ రోజే చేసుకోండి. వ‌రుస‌గా 5 రోజులు సెల‌వులు

Dabbeda Mohan Babu
అన్ని బ్యంక్ ఖాతాదారుల‌కు ముఖ్య గ‌మ‌నిక. బ్యాంక్ ల్లో ఈ వారానికి సంబంధించిన ప‌నులు ఉంటే ఈ వార్త మీ కోస‌మే. ఈ వారంలో పూర్తి కావ‌ల్సిన ప‌నుల‌న్నీ ఈ రోజే పూర్తి చేసుకొండి. ఈ రోజే బ్యాంక్ కు వెళ్లండి. పెండింగ్‌లో ఉన్న ప‌నుల‌న్నీ చేసేయండి. ఈ రోజు మిస్ అయితే వారం రోజుల పాటు వేయిట్ చేయాల్సిందే. ఎందుకంటే బుధ‌వారం నుంచి ఆదివారం వ‌ర‌కూ అన‌గా సెప్టెంబ‌ర్ 8 నుంచి, సెప్టంబ‌ర్ 12 వ‌ర‌కు అన్ని బ్యాంకుల‌కు సెల‌వులు ఉండ‌నున్నాయి. కాబ‌ట్టి బ్యాంకుకు సంబంధించిన ఏ ప‌ని ఉన్న ఈ రోజే పూర్తి చేసేయండి.


 రేపు అన‌గా బుధవారం సెప్టెంబ‌ర్ 8న శ్రీమంత శంక‌ర‌దేవ తిథి ఉంటుంది. అలాగే గురువారం అంటే సెప్టెంబ‌ర్ 9న లంబాడీల ఆరాధ్య పండుగ‌ తీజ్ పండుగ ఉండ‌నుంది. దీంతో పాటు శుక్రవారం సెప్టెంబ‌ర్ 10న హిందువులతో పాటు అన్ని ర‌కాల మ‌తాల ప్ర‌జ‌లు భ‌క్తి శ్ర‌ద్ధ‌ల‌తో జ‌రుపుకునే వినాయ‌క చ‌వితి ఉంది. వీటితో పాటు సెప్టెంబ‌ర్ 11న రెండో శనివారం, సెప్టెంబ‌ర్ 12న ఆదివారాలు సాధార‌ణ సెల‌వులు ఉన్నాయి. కాబ‌ట్టి బ్యాంక్ వినియోగ‌దారులు ఈ సెల‌వుల‌ను గ‌మ‌నించాలి. అలాగే ప‌నుల‌ను ఈ రోజే ముగించుకోండి.  


అయితే అన్ని రాష్ట్రాల ఉన్నబ్యాంక్ ల‌కు ఈ సెలవులు వ‌ర్తించ‌వు. బ్యాంక్‌ల సెల‌వులు అన్ని రాష్ట్రాల‌కు స‌మానం ఉండ‌వు. ఆయా రాష్ట్రం ప‌రిస్తితిని బ‌ట్టి బ్యాంక్ ల సెల‌వులు మారతాయి.  సెల‌వు దినాల‌ల్లోనూ అన్ని బ్యాంక్ ల ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ మ‌రియు అన్ని ర‌కాల యూపీఐ సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ పండుగ‌లు జ‌రుకునే రాష్ట్రాల‌ల్లో మాత్ర‌మే అన్ని బ్యాంక్ ల‌కు సెల‌వులు ఉండ‌నున్నాయి.  అలాగే ఈ పండుగ‌లు జ‌రుపుకోని రాష్ట్రాల‌ల్లో బ్యాంక్ ల‌కు సెల‌వులు ఉండ‌వు. అక్క‌డ అన్ని బ్యాంక్ లు య‌దావిధింగా తెరుచుకుంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: