బంగారు వ్యాపారులకు ఉపశమనం!

N.Hari
బంగారు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం కాస్తా ఉపశమనం కలిగించింది. బంగారు ఆభరణాలపై హాల్‌ మార్క్‌ నియమం గడువును మరో మూడు నెలలు పొడిగిస్తామని సంకేతాలు ఇచ్చింది.
బంగారు ఆభరణాల స్వచ్ఛతకు హాల్ మార్క్ నిదర్శనం. అయితే హాల్ మార్క్ ముద్రను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్‌ను తెచ్చింది. ఈ క్రమంలో హాల్ మార్కింగ్ విధానంలో వ్యాపారులకు ఉపశమనం కలిగేలా.. కేంద్రం మూడు నెలల గడువు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది..! హాల్ మార్కింగ్‌కు సంబంధించి కేంద్రం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది.  హాల్‌మార్కింగ్‌ లేని ఆభరణాలు అమ్మితే కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వం హాల్‌ మార్కింగ్‌ విధానం తేవడంతో  స్వర్ణకారులు ఆందోళనలో ఉన్నారు. కాగా ఓల్డ్‌ ఆర్నమెంట్స్‌ హాల్‌ మార్కింగ్‌ రూల్స్‌లో ప్రభుత్వం ఇంకోసారి ఊరట కలిగించే ఛాన్స్‌ ఉంది. హాల్‌ మార్కింగ్‌ విధానంపై గడువు పెంచే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
స్వర్ణకారులు, వ్యాపారవేత్తలు సమ్మెకు దిగడంతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ స్వర్ణకారులతో సమావేశం అయ్యారు. హాల్‌ మార్కింగ్‌పై, స్వర్ణకారుల సమస్యలపై చర్చించారు. దీంతో ఒక కమిటీని  కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ వ్యాపారులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తుంది. హాల్‌ మార్కింగ్‌ విధానంపై పరిశీలించనుంది. భారతీయ స్టాండర్డ్స్‌ ప్రభుత్వ బ్యూరో.. జూన్‌ 16వ తేదీ నుంచి నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు పాత స్టాక్‌కు హాల్‌ మార్క్‌ చేయడానికి అనుమతి ఇచ్చింది. దీనిపై నగల వ్యాపారులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన హాల్‌ మార్కింగ్‌ విధానంపై ఇటీవల దేశ వ్యాప్తంగా 350 స్వర్ణకారుల సంఘాలు సమ్మె చేశాయి. హాల్‌ మార్కింగ్‌ విధానం సజావుగా అమలు చేయడానికి నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని కోరాయి. ఇందుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. దాంతో గడువు పొడిగించే అవకాశం ఉంది. బంగారు నగలపై తప్పనిసరి చేస్తూ తీసుకొచ్చిన హాల్‌ మార్కింగ్‌ పాలసీ కస్టమర్లకు, అమ్మకం దారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతున్నది. జూన్‌ 16 నుంచి దశల వారీగా బంగారంపై హాల్‌ మార్కింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: