తక్కువ వడ్డీ రేట్లతో గోల్డ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులు..?

Suma Kallamadi

సాధారణంగా ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకున్న లేదా ఇంకేదైనా అత్యవసరముంటే దాదాపుగా అందరికీ గుర్తొచ్చేది గోల్డ్ లోన్ మాత్రమే. బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టు పెట్టడం ద్వారా తమ అవసరాలకు డబ్బును రుణంగా ఇస్తుంది బ్యాంకు. కాగా, తక్కువ వడ్డీ రేట్లకే బ్యాంకులు గోల్డ్ లోన్స్ ఇస్తున్నాయి. వ్యక్తిగత రుణాల కంటే కూడా చాలా వేగంగా తక్కు వడ్డీ రేట్లతో బంగారు ఆభరణాలపై రుణాలు మంజూరవుతాయి. అయితే, ఇందుకుగాను రుణం తీసుకోవాలనుకునే వారు బంగారు ఆభరణాలను హామీగా బ్యాంకులో తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. బ్యాంకు మేనేజర్‌కు దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆయన అప్లికేషన్ పరిశీలించి రుణం మంజూరు చేస్తారు.

క్రెడిట్ స్కోరు చాలా తక్కువగా ఉన్న వారి దరఖాస్తులను మాత్రం బ్యాంకులు రిజెక్ట్ చేస్తుంటాయి. అయితే, బంగారు ఆభరణాలను ఇలా తాకట్టు పెట్టడం ద్వారా వచ్చే డబ్బు అప్పటి అవసరాలకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత క్రమంలో డబ్బులు చెల్లిస్లే బంగారు ఆభరణాలు మళ్లీ వెనక్కు వచ్చేస్తాయి. అయితే, సాధారణంగా బ్యాంక్స్ తాకట్టు పెట్టిన గోల్డ్‌కు మార్కెట్ వాల్యూలో 75 పర్సెంట్ వరకు మాత్రమే రుణం మంజూరు చేస్తాయి. ఈ నేపథ్యంలో బంగారం ద్వారా వచ్చే రుణంపై కస్టమర్స్ అంచనా వేసుకుంటే మంచిది. తద్వారా వచ్చే రుణం సరిపోతుందా? లేదా? అనేది నిర్ధారించుకోవచ్చు. ఒకవేళ మీ వద్ద ఉన్న గోల్డ్ వాల్యూ వన్ లాక్ అయితే మీరు రూ.75 వేల కంటే ఎక్కువ మనీని రుణంగా పొందలేరు. 

ఇకపోతే లోన్ తీసుకునే క్రమంలో బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజు, ప్రీపేమెంట్ ఛార్జీలతో పాటు త్వరగా రుణం అందుతుందో లేదో అప్లికెంట్స్ క్లియర్‌గా చెక్ చేసుకోవాలి. రీపేమెంట్‌లు ఆలస్యమైతే ఫైన్ కట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈఎంఐలను నిక్కచ్చిగా తెలుసుకున్న తర్వాతే లోన్ తీసుకోవడం మంచిది. రెండేళ్లకుగాను ఒక లక్ష రూపాయలకు వడ్డీ రేట్లు, ఈఎంఐలు ఎలా ఉన్నాయంటే. పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వారీ వడ్డీ రేటు 7.00 శాతం కాగా, ఈఎంఐ రూ.4,477. కెనరా బ్యాంక్ వారి వడ్డీ రేటు 7.35 శాతం, ఈఎంఐ రూ.4,493గా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేటు 7.50 శాతం కాగా, ఈఎంఐ రూ.4,500గా ఉంది. ఇక యూనియన్ బ్యాంక్ వడ్డీ రేటు 8.20 శాతం కాగా, ఈఎంఐ రూ.4,532గా ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వడ్డీ రేటు 8.45 శాతం కాగా, ఈఎంఐ రూ.4,543గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: