జొమాటో కస్టమర్లకు అదిరిపోయే న్యూస్.. ఆ ప్యాకేజీ కింద డెలివరీలు అన్నీ ఉచితమే..!

Suma Kallamadi
ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో తమ వినియోగదారుల కోసం ఒక సరికొత్త సేవను అందుబాటులోకి తెచ్చింది. zomato Pro Plus పేరిట విడుదలైన ఈ మెంబర్షిప్ సేవ ద్వారా వినియోగదారులు అపరిమితంగా ఉచిత డెలివరీలను పొందొచ్చు. అమెజాన్ ప్రైమ్ ప్యాకేజ్ కి సబ్ స్క్రైబ్ చేసుకుంటే అపరిమిత ఫ్రీ డెలివరీ లతో పాటు అనేక ఆఫర్లు లభిస్తాయి. అచ్చం అదే బెనిఫిట్స్ తో తాము కూడా జొమాటో ప్రో ప్లస్ ప్యాకేజీ విడుదల చేశామని సీఈఓ దీపిందర్ గోయల్ ట్వీట్ చేశారు. ఇప్పటికే తమ సంస్థలో 18 లక్షల జొమాటో ప్రో మెంబర్స్ ఉన్నారని ఆయన వెల్లడించారు. అమెజాన్ ఫ్రీ డెలివరీ లాగా జొమాటో ఫ్రీ డెలివరీ కూడా లాంచ్ చేయాలంటూ కస్టమర్లు డిమాండ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వారి డిమాండ్ మేరకు సెలెక్టెడ్ కస్టమర్ల కోసం ప్రో ప్లస్ ఫీచర్ లాంచ్ చేశామని ఆయన అన్నారు.




సోమవారం సాయంత్రం 6:00 గంటల తర్వాత 1.8 మిలియన్ జొమాటో ప్రో సభ్యులలో "ఎంపిక చేసిన కస్టమర్‌లు" లిమిటెడ్ ఎడిషన్ ప్రో ప్లస్ మెంబర్‌షిప్ ని యాక్సెస్ చేయగలరని దీపిందర్ గోయల్ వెల్లడించారు. ప్రస్తుతం, ఇన్వైట్ ప్రాతిపదికన ప్రో మెంబర్ షిప్ ఇస్తున్నామని ఆయన తెలిపారు. అన్ని జొమాటో ఎడిషన్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఆటోమేటిక్ గా జొమాటో ప్రో ప్లస్ కు అప్‌గ్రేడ్ చేయబడతారని ఆయన తెలిపారు. మిగిలిన వినియోగదారులు తమ అప్లికేషన్ ద్వారా ప్రో ప్లస్ కి అప్‌గ్రేడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న కస్టమర్లకు సర్జ్‌, డిస్టెన్స్ ఫీజుల నుంచి మినహాయింపు లభిస్తుంది.‌ జొమాటో అధికారికంగా మెంబర్షిప్ ధరల వివరాలను తెలపలేదు. కానీ నివేదికల ప్రకారం, 3 నెలలకు ప్రో మెంబర్‌షిప్‌ తీసుకోవాలంటే 200 వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.


అయితే జొమాటో ప్రో ప్లస్ మెంబర్‌షిప్ అందుబాటులోకి తేవడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా ప్రత్యర్థులకు బలమైన పోటీ ఇస్తూ మార్కెట్లో నెంబర్ వన్ గా కొనసాగడానికి.. అలాగే కస్టమర్ల నుంచి ఎక్కువ రెవెన్యూ సంపాదించడానికి.. నిజానికి 2021 ఆర్థిక సంవత్సరంలో జొమాటో రెవెన్యూ సేల్స్ 34 శాతం పడిపోయాయి. స్విగ్గి సూపర్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ కింద తన కస్టమర్లకు అపరిమితంగా ఉచిత డెలివరీలు చేస్తోంది. దీంతో ఫుడ్ డెలివరీ వ్యాపారంలో స్విగ్గి జొమాటోకి బలమైన ప్రత్యర్థిగా ఎదుగుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: