ట్రైన్ టికెట్ బుకింగ్‌లో న్యూ రూల్స్...?

Suma Kallamadi
కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్‌లో రవాణా వ్యవస్థలైన బస్, రైల్వేలు బందైన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల కాలంలో ట్రైన్, బస్సు ప్రయణాలు షురూ అయ్యాయి. ఈ క్రమంలోనే జనాలు మళ్లీ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ వైపు మెల్ల మెల్లగా మొగ్గు చూపుతున్నారు. కాగా, భారత రైల్వే శాఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానంలో నూతన నియమాలు తీసుకొచ్చింది. అవేంటంటే..
ప్రస్తుత కాలంలో ఆన్ లైన్‌కు అలవాటు పడిన ప్రజలు ప్రతీది ఎలక్ట్రానిక్ అయితే బాగుండు అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. కాగా వారందరూ ఇప్పుడు న్యూ రూల్స్ పాలో అవ్వాల్సిందే. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రయాణికుల కోసం ఈ రూల్స్ అమలులోకి వచ్చాయి. ఇకపై ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా వారు తమ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీతో వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ తర్వాతనే ప్రయాణికులు తమ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ చేసుకునే వీలుంటుంది. ఇందుకు 50 సెకన్ల నుంచి 60 సెకన్ల సమయం పడుతుంది. అయితే, బుకింగ్ కోసం ప్రయాణికులందరూ ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. తమ రిజిస్టర్డ్ ఈమెయిల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈ రెండు పనులు అయిన తర్వాతనే రైలు టికెట్ బుకింగ్ ప్రాసెస్ మొదలవుతుంది.
ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో లాగిన అయిన తర్వాత న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. అనతరం రిజిస్టర్‌డ్ మొబైల్ నెంబర్, ఈ మెయిల్ ఐడీని ఎంటర్ చేసిన తర్వాత వెరిఫికేషన్ ప్రాసెస్ మొదలు అవుతుంది. పేజీలో కుడివైపు సెక్షన్‌లో వెరిఫికేషన్ బటన్ ప్రెస్ చేయాలి. ఆ తర్వాత పేజీలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వివరాలు సరిగా లేకుంటే అప్‌డేట్ కూడా చేసుకోవచ్చు. ఇందుకు ఎడిట్ ఆప్షన్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పూర్తి వివరాలు సమర్పించిన తర్వాత మొబైల్ నెంబర్‌కు ఫైనల్ ఓటీపీ వచ్చాక, అది ఎంటర్ చేస్తే ఫైనల్ సబ్మిషన్ పూర్తవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: