కరోనా మహమ్మారి దేశంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పెట్రోల్, డీజిల్, వంట నూనెలు.... ఇలా అన్ని నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. పెట్రోల్ డీజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి పెట్రోల్ ధరలు. ఇలా అన్ని నిత్యావసర దూల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో లో కాస్త ఊరట లభించనుంది. తాజాగా... ఇండియాలో జూన్ నెల కు గానూ రిటైల్ ద్రవ్యోల్బణం స్వల్పంగా... 6.26 శాతానికి తగ్గింది.
అయితే ఈ రిటైల్ ద్రవ్యోల్బణం మే మాసంలో ఏకంగా 6.3 శాతానికి నమోదయింది. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్.... సోమవారం రోజున ఈ రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను రిలీజ్ చేసింది. ద్రవ్యోల్బణం కాస్త తగ్గినప్పటికీ.... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనాలకు మించి రిటైల్ ద్రవ్యోల్బణం నమోదు కావడం ఇది రెండోసారి కావడం విశేషం. జూన్ నెలలో ప్రధానంగా ఆహార ఉత్పత్తుల ధరలు, చమురు ధరల కారణంగా రీటైల్ ద్రవ్యోల్బణం కాస్త పెరిగింది. ఆహార ద్రవ్యోల్బణం జూలైలో 5.51 శాతానికి పెరిగింది...
ఈ ద్రవ్యోల్బణం మే మాసంలో 5.01 శాతంగా ఉందని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వెల్లడించింది. ఆహార ఉత్పత్తుల్లో.. ఆహార, పానీయాల విభాగంలో ద్రవ్యోల్బణం 5.58 శాతంగా నమోదైంది. ఇంధన లైట్ ఈ విభాగంలో ద్రవ్యోల్బణం మే మాసం తో పోల్చుకుంటే... జూన్ నెలలో... 12.68 శాతం గణనీయంగా పెరిగింది. అదే మే నెలలో 11.58 శాతంగా నమోదు అయింది. ఇది ఇలా ఉండగా.. మన దేశంలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశానికి తాకిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాలలో సెంచరీ దాటాయి చమురు ధరలు. ఇక మన తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి ప్రతీయకంగా చెప్పనక్కర్లేదు. రెండు రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు వంద మార్క్ ను ఎప్పుడో దాటేశాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో పెట్రోల్ 105 గా ఉంది.