బిజినెస్ : కేవలం కొద్ది నిముషాల్లోనే రూ. 10 లక్షల రుణం..

Divya

సాధారణంగా మనం బ్యాంకులకు వెళ్లి లోన్  తీసుకోవాలంటే ఎన్నో నియమాలను  మనం అనుసరించాల్సి ఉంటుంది. అయితే మీరు కూడా ఒకవేళ లోన్ తీసుకోవాలని అనుకున్నట్లయితే మీకు ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ఎవరైతే బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారో , అలాంటివారికి ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ సరికొత్తగా గా ఎటువంటి కష్టం లేకుండా కేవలం కొద్ది నిమిషాలలోనే  రుణాలను అందిస్తోంది. దీని వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తన కంపెనీ కార్యకలాపాలను విస్తృతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం వల్ల కస్టమర్లు ఎటువంటి ఇబ్బంది పడకుండా, తక్కువ సమయంలోనే వారికి కావాల్సిన మొత్తాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. ఇందులో ఈ లోన్ ట్యాప్ కు సంబంధించి 32 వేల మంది కస్టమర్లు ఉండటం గమనార్హం. ఈ  కొత్త నిర్ణయం వల్ల లోన్ తీసుకునే కస్టమర్ లు మరింత పెరిగే అవకాశం ఉంటుందని బ్యాంక్ యోచిస్తున్నట్లు సమాచారం.
ఇక ఎవరైతే రుణం పొందాలని భావిస్తున్నారో అలాంటివారు లక్ష రూపాయల నుంచి రూ.10 లక్షల వరకు లోన్ పొందే అవకాశాలు ఉన్నాయి.అయితే రుణం కింద  బ్యాంకుల్లో తీసుకున్న మొత్తాన్ని రెండు సంవత్సరాల లోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ, ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారికి ఇది ఒక మంచి బెనిఫిట్ అని చెప్పవచ్చు . ఇక లోన్ తీసుకోవాలి అని అనుకుంటున్న వారు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రవేశపెట్టిన లోన్ ట్యాప్ ద్వారా రుణం పొందే అవకాశం ఉంటుంది.
ఇటీవల కాలంలో బ్యాంకుల నుంచి రుణం పొందాలి అంటే, గంటల తరబడి వేచి ఉండాలి .ఒక్కోసారి సమయం కలిసి రాకపోతే రోజుల తరబడి కూడా వేచి చూడవలసిన అవసరం కూడా ఉంటుంది. కానీ ఉజ్జీవన్ బ్యాంక్ తమ కస్టమర్లను పెంచుకునే నేపథ్యంలోనే ఇలాంటి లోన్ ఆఫర్లను, తమ కస్టమర్లకు చూపిస్తోందని చెప్పవచ్చు. అత్యవసర పరిస్థితులలో లోన్ సదుపాయం కల్పించడం అందరికీ ప్రయోజనకరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: