మరో ఘనత సాధించిన హొండా.. భారీ సేల్స్..

Satvika
ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హోండా ఇప్పుడు మరో ఘనత సాధించింది. ఇప్పటికే ఎన్నో అద్భుతాలను అందుకుంటూ వస్తున్న ఈ కంపెనీ కొత్త బైకులను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. యువతను ఆకట్టు కొనేలా వాహనాలను తయారు చేయడంలో ఈ కంపెనీకి తర్వాతే ఎవరైనా కూడా.. అందుకే అగ్రగామి సంస్థగా పేరు పొందింది. ఇకపోతే ఇప్పుడు మరో మెయిలు రాయిని అందుకుంది. తాజాగా మరో కొత్త బైక్ ను మార్కెట్ లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హొండా మంకీ బైక్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు.


సరికొత్త ఫీచర్లతో ఈ బైక్ రూపొందించబడింది.ప్రస్తుతం దీని  ఫీచర్లు మార్కెట్ లో మంచి డిమాండ్ అందుకునేలా ఉన్నాయని సంస్థ వెల్లడించింది. అదరహో అనిపించే పీచర్లతో పాటుగా స్టైల్ లుక్ ను కూడా కలిగి ఉంది. ఈ అధునాతన బైక్‌ను ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ గేర్ బాక్స్ సిస్టమ్‌తో అభివృద్ధి చేశారు.  ఆఫ్ సెట్ సిలిండర్ ఇంజిన్, రోలర్ రాకర్ వాల్వ్ గేర్, అడ్వాన్సెడ్ ఇంటర్నల్స్ తో పాటు లో ఫ్రిక్షన్ కోటింగ్స్ లాంటి ప్రత్యేకతలను ఈ బైక్ కలిగిఉంది.


1.5 లీటర్ కు 100 కిలోమీటర్ల మైలేజ్ ను అందిస్తుంది. ఇంజన్ సెటప్ బఠాణి గింజ ఆకారంలో ఉంటుంది. ఈ బైక్ కు ఇదే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బ్రేకింగ్ సెటప్ దగ్గరకొస్తే 220 ఎంఎం ఫ్రంట్ డిస్క్ బ్రేక్, 190 ఎంఎం బ్యాక్ డిస్క్ బ్రేక్స్ ను అందిస్తున్నట్లు  సంస్థ పేర్కొంది.గతంలో  వచ్చిన బైక్ బరువు 107 కేజీల ఉండగా, ఇప్పుడు మార్కెట్ లోకి  రానున్న బైక్ 104 కేజీలు ఉంటుంది. అంటే 3 కేజీల బరువును తగ్గించారు. దీంతో బండి ఆకర్షణీయంగా మారింది. బిజినెస్ ను పెంచుకొనే క్రమంలో  హోండా చేస్తున్న ఈ కొత్త ప్రయోగ ఎంతవరకు సక్సెస్ అవుతూనే వచ్చే ఏడాది తెలియనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: