జులై 1నుంచి కొత్త రూల్స్.. అవేంటంటే!

Suma Kallamadi
ఇప్ప‌టి వ‌ర‌కు ఒక లెక్క‌. ఇక నుంచి మ‌రో లెక్క అన్న‌ట్టు త‌యార‌య్యాయి ఇప్పుడున్న రూల్స్‌. అవేంటంటే.. ఇప్పుడ మ‌నం జూన్ నెల చివరకు వచ్చేశాం. త్వ‌ర‌లోనే జులై నెలలోకి ఎంట్రీ ఇవ్వడానికి మరో వారం రోజులు సిద్ధంగా ఉన్నాయి. కాక‌పోతే ఒక‌త్త నెల రావడంతోపాటు గా కొన్ని కొత్త రూల్స్‌ను కూడా తీసుకువస్తోంది. అవేంటంటే జులై 1 నుంచి పలు అంశాలు మారబోతున్నాయ‌ని తెలుస్తోంది. వచ్చే నెల నుంచి ఏ ఏ అంశాలు మారబోతున్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు సాధారణంగా అయితే ప్రతి నెలా ఒకటో తేదీనే మారుతూ ఉంటాయ‌ని అంద‌రికీ తెలిసిందే. కాగా వచ్చే నెల కూడా ఇదే జరగొచ్చ‌ని తెలుస్తోంది. అయితే కొన్ని సందర్భాల్లో సిలిండర్ రేటు స్థిరంగా కూడా కొనసాగవచ్చ‌నేది ఇప్పుడున్న సాధార‌ణ అంశం. ఇక రెండో అంశం ఏంటంటూ దేశీ అతిపెద్ద బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా sbi కొత్త రూల్స్ తీసుకురావ‌డానికి రెడ అవుతోంది. త్వ‌ర‌లోనే చెక్ బుక్ తో పాటు ఏటీఎం క్యాష్ విత్‌డ్రా రూల్స్ లో మార్పులు రానున్నట్టు స‌మాచారం. ఇక వీటిల్లో చార్జీలు పెంచింది బ్యాంకు. బేసిక్ సేవింగ్స్ ఖాతాలకు ఈ విధంగా కొత్త నిబంధనలను వర్తిస్తాయ‌ని తెలిపింది.

ఇక మూడోది ఏంటంటే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయని వారు ఈ నెలలోపు ఆ పనిని పూర్తి చేయాల‌ని ఉంది. లేక‌పోతే జూలై 1వ తేదీ నుంచి డబుల్ టీడీఎస్ చెల్లించుకోవాల్సి వస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది సంస్థ‌. అలాగే నాలుగో అంశం ఏంటంటే సిండికేట్ బ్యాంక్ కస్టమర్లు ఒక విషయం త‌ప్ప‌కుండా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. బ్యాంక్ ఐఎఫ్ఎస్‌సీ కోడ్లు వచ్చే నెల నుంచి చెల్లవ‌ని తెలుస్తోంది.

ఎందుకంటే కొత్తగా కెనరా బ్యాంక ఐఎఫ్ఎస్‌డీ కోడ్లు ఉపయోగించాల‌ని రూల్ వ‌చ్చింది. లేక‌పోతే ఆన్‌లైన్‌లో డబ్బులు పంపడం అస్స‌లు వీలు కాద‌ని ఈ బ్యాంకు క‌స్ట‌మ‌ర్ల‌కు చెబుతోంది. ఇక ఐదో అంశం ఏంటంటే మారుతీ సుజుకీ, హీరో మోటొకార్ప్ లాంటి పెద్ద కంపెనీలు ఇప్పటికే ధరలు పెంచుతున్నట్లు స్ప‌ష్టం చేశాయి. ఆ ధరల పెంపు జూలై 1 నుంచి అమలులోకి వ‌స్తుంద‌ని తెలుపుతున్నాయి. ఇక కొత్తగా వెహికల్ కొనే వారిపై ఇది ప్రతికూల ప్రభావం చూపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: