ఈ బిజినెస్ చేస్తే సంవత్సరానికి 6 లక్షలు లాభం.. ఎలాగంటే ?

Satvika
చాలా మంది బిజినెస్ చేసి లక్షలకు లక్షలు డబ్బులు సంపాదించాలని అనుకుంటారు. ఎటువంటి బిజినెస్ చేయాలనీ ఆలోచనలో ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం అదిరి పోయే బిజినెస్ ఐడియా ఉంది. అదే సొంతంగా సబ్బులను తయారు చేయడం. సబ్బు తయారీ వ్యాపారం కూడా మీకు ఆదాయ వనరుగా మారుతుంది. ఈ రోజు సబ్బు తయారీ యూనిట్ గురించి తెలుసుకుందాం. మీరు చాలా తక్కువ డబ్బుతో సబ్బు కర్మాగారాన్ని తెరవవచ్చు. ప్రత్యేకత ఏమిటంటే ఈ పని కోసం మోదీ ప్రభుత్వ ముద్రా పథకం కింద 80 శాతం మొత్తాన్ని రుణంగా అందిస్తుంది.


ఈ పథకం కింద 4 లక్క్షల వరకు రుణాన్ని పొందవచ్చు. మనకు అంత అమౌంట్ అవసరం కూడా. ఉత్పత్తి ప్రారంభమైన తర్వాత సంవత్సరంలో 4 లక్షల కిలోల సబ్బును తయారు చేయగలుగుతారు. మొత్తం 47 లక్షలను సంపాదించవచ్చునని మార్కెట్ నిపుణులు అంటున్నారు. అందులో తయారీకి , సరుకు తయారు చేసినదానికి ఇలా అన్నిటికి పోగా సంవత్సరానికి 6 లక్షల లాభాన్ని పొందవచ్చు. అంటే నెలకు 50 వేలు చొప్పున.


ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీరు రూ.4.23 లక్షలు చూపించాల్సి ఉంటుంది. ప్రధాన్ మంత్రి ముద్ర రుణ యోజన కింద మీరు ఏ బ్యాంకులోనైనా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీని కోసం మీరు ఒక ఫారమ్ నింపాలి. దీనిలో పేరు, చిరునామా, వ్యాపార ప్రారంభ చిరునామా, విద్య, ప్రస్తుత ఆదాయం, రుణ మొత్తం మొదలైన వాటి గురించి సమాచారం ఇవ్వాలి. అప్పుడు వాళ్లు వెరిఫికేషన్ చేసి డబ్బులను అందిస్తారు. ఈ విధానం ద్వారా డబ్బులను పొందటానికి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీ కట్టవలసిన అవసరం లేదు. ఈ బిజినెస్ మంచిగా క్లిక్ అయితే లక్షలు ఏంటి అంతకు మించి సంపాదించవచ్చు. ఇక ఆలస్యం ఎందుకు మీకు ఈ ఆలోచన నచ్చితే మీరు కూడా మొదలు పెట్టండి.. లాభాలను పొందండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: