జియో వినియోగదారులకు అదిరిపోయే ఆఫర్..

Satvika
దేశం మొత్తం కరోనా మహమ్మారి వల్ల పీడింప బడుతుంది.. దీనివల్ల ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయ్యింది.. ఈ మేరకు చాలా నెట్ వర్క్ లు తమ కస్టమర్స్ కోసం అదిరిపోయే ఆఫర్ లను అందిస్తున్నారు.నేపథ్యంలో టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో తన వినియోగదారు ల కోసం ప్రత్యేకంగా రెండు కార్యక్రమాల ను ప్రకటించింది. జియో ఫోన్‌ వినియోగ దారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ముఖ్యంగా రెండు పథకాల ను ఈ సందర్భం గా ప్రకటించింది. వీటి వల్ల కస్టమర్ల కు మంచి లాభాలు పొందుతారు.. ఇప్పటికే జియో ప్లాన్ లకు మంచి స్పందన వస్తోందన్న విషయం అందరికీ తెలిసిందే


కరోనా విపత్తు సమయం లో ఉచిత ఔట్ ‌గోయింగ్‌ కాల్స్‌ను అందించనున్నట్లు ప్రకటించింది. కరోనా విపత్తు ముగిసే వరకు నెలకు 300 నిమిషాల ఉచిత ఔట్‌గోయింగ్‌ కాల్స్‌(రోజుకు10 నిమిషాలు) ఉచితం. అలాగే జియోఫోన్ వినియోగదారు రీఛార్జ్ చేసిన ప్రతి ప్లాన్ ‌ఫై అంతే సమానమైన రీఛార్జ్ వాల్యూను ఉచితం గా అందించనుంది. ఉదాహరణకు 75 రూపాయల ప్లాన్‌ తో రీఛార్జ్ చేసే జియో ఫోన్ యూజర్ అదనంగా మరో 75 రూపాయల ప్లాన్‌ ప్రయోజనాల ను ఉచితంగా పొందవచ్చు.. 


ఈ విషయం గురించి రిలయన్స్ జియో తాజాగా ప్రకటించింది. జియో వాడుతున్న ప్రతి ఒక్కరికీ డిజిటల్ లైఫ్‌ అందించే లక్ష్యం తో జియో ఫోన్‌ను తీసుకొచ్చాం.. ప్రస్తుత మహమ్మారి సంక్షోభకాలంలో వారికి ఎఫర్డబుల్‌ ధరలో, నిరంతరం సేవలు అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని జియో వెల్లడించింది ఈ కాలం లో రీఛార్జ్‌ చేయించుకోలేక పోయిన జియోఫోన్‌ వినియోగదారులకు ఈ పథకాలు ప్రయోజనకరంగా ఉంటాయని తెలిపారు.. గతంలో చాలా మంచి ఆఫర్లను అందుబాటు లోకి తీసుకు వచ్చారు.. ఈ ప్లాన్ వల్ల జియో కస్టమర్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: