గుడ్ న్యూస్.. ఇలా బుక్ చేస్తే 61 రూపాయికే గ్యాస్ సిలిండర్..

Satvika
కరోనా ప్రభావం వల్ల నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి.. అదే విధంగా గ్యాస్ ధరలు కూడా ఓ రేంజులో పెరిగిపోయాయి.పేదల పాలిట ఈ గ్యాస్ ధరలు గుండె పోటును తెప్పిస్తున్నాయి. నెల నెలా రేట్లు భారీ స్థాయిలో పెరుగుతున్నాయి. ఇప్పటికే ధరలు 900 దగ్గర ఉన్నాయి.హైదరాబాద్ లో 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 861గా ఉంది. కరోనా దెబ్బకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న అనేక మంది గ్యాస్ సిలిండర్ ను ఇంత ధరతో బుక్ చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అయితే ప్రముఖ పేమెంట్స్ యాప్ పేటీఎం గ్యాస్ సిలిండ్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్యాస్ బుకింగ్ పై భారీ క్యాష్ బ్యాక్ ను ప్రకటించింది.  ఒక సిలిండర్ పై దాదాపు 800 తగ్గే ఆఫర్ ను ప్రకటించింది.. అంటే గ్యాస్ ధర కేవలం 61 రూపాయికే వస్తుంది.ఆఫర్ ఈ నెల 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇకపోతే ఈ ఆఫర్ ను పేటీఎం ద్వారా మొదటిసారి పేమెంట్ చేసుకొనే వారికి మాత్రమే వర్తిస్తుంది.
ఈ యాప్ ద్వారా ఎలా పేమెంట్ చేయాలంటే..
మొదటగా పేటీఎం యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.
తర్వాత 'రీచార్జ్ అండ్ పే బిల్స్.. ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
తర్వాత మీకు 'బుక్ ఏ సిలిండర్' ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
అనంతరం మీ గ్యాస్ ప్రొవైడర్ ను ఎంచుకుని మీ వివరాలు నమోదు చేయాలి.
అనంతరం 'ప్రొసీడ్ టూ పే ' ఆప్షన్ పై క్లిక్ చేసి బిల్ చెల్లించాలి.
ఇలా మొదటి సారి బుక్ చేసిన వారికి అటోమెటిగా ఆఫర్ అప్లై అవుతుంది.
గ్యాస్ సిలిండర్ బుకింగ్ అనంతరం స్క్రాచ్ కార్డు వస్తుంది.
ఆ స్క్రాచ్ కార్డును ఓపెన్ చేసి క్యాష్ బ్యాక్ ను పొందొచ్చు.
క్యాష్ బ్యాక్ రూ. 10 నుంచి రూ.800 ఎంతైనా రావొచ్చు.
 స్క్రాచ్ కార్డును 7 రోజుల్లోగా వినియోగించాల్సి ఉంటుంది.. అంతే ఎంతో సింపుల్ ఇలా చేస్తే మీకు సిలిండర్ పై 800 ఆదా అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: