ఆ తేదీన బంగారం కొంటే .. గోల్డ్ కాయిన్ ఫ్రీ .. !

frame ఆ తేదీన బంగారం కొంటే .. గోల్డ్ కాయిన్ ఫ్రీ .. !

Satvika
బంగారం కొనడానికి మహిళలు ఎప్పుడు ముందుంటారు.. మార్కెట్ లో ధరలు కాస్త కిందకు వచ్చాయి అంటే ఇక వాళ్ళ కోరికలకు రెక్కలు వచ్చినట్లే..అయితే ఆ రోజు బంగారం కొంటె అదృష్టం పట్టినట్లే అని ప్రముఖులు అంటున్నారు.బంగారం కొనే వినియోగదారులకు సరికొత్త ఆఫర్‌ అందుబాటులో ఉంది. ఈ రోజుల్లో బంగారం ధరలు కూడా పడిపోతున్నాయి. అయితే అసలు విషయం ఏమిటంటే మీరు రూ.25 వేల బంగారం కొంటే దానికి ఉచితంగా గోల్డ్‌ కాయిన్స్‌ పొందవచ్చు. కానీ, ఈ ఆఫర్‌ మే 14న మాత్రమే అందుబాటులో ఉంటుంది.. 


మీరు విన్నది అక్షరాల నిజం.. అయితే ,ఈ ఆఫర్ ను కల్యాణ్‌ జువెలర్స్‌కు చెందిన కాండెరే బ్రాండ్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో మీరు రూ.25 వేలు లేదా అంతకంటే ఎక్కువ ధర కలిగిన బంగారు ఆభరణాలు కొనాల్సి ఉంటుంది. ఆ సమయంలోనే ఉచితంగా కాయిన్ ను పొందవచ్చు.. అది కూడా అక్షయ తృతీయ నాడు మాత్రమే.. ఈ ఏడాది మే 14 న అక్షయ తృతీయ రానుంది .ఆ రోజు బంగారం కొంటే సకల శుభాలు జరుగుతాయని, మంచిదని అందరూ విశ్వసిస్తారు. చాలా మంది వినియోగదారులకు కూడా ఒక ముక్కు పుడకంత బంగారం అన్న కొనడానికి ప్రయత్నిస్తారు. 


అందుకే జువెలరీ సంస్థలు ఆరోజు కోసం ఇప్పటి నుంచే ఆఫర్లు వెల్లడిస్తున్నాయి. మరికొన్ని జువెలరీ సంస్థలు ఎంత బంగారం కొంటే.. అంత వెండి ఉచితం అని కూడా గతంలో ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. ఇలా చేయడం వల్ల వాళ్ళ బిజినెస్ కూడా గాడిలో పడుతుందని వారి నమ్మకం..ఇకపోతే ప్రస్తుతం మార్కెట్ ఉన్న బంగారం. ధరలను చూస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.170 పెరుగుదలతో రూ.48,330కు చేరింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.150 పెరుగుదలతో రూ.44,300కు పెరిగింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: