టేకీలకు గుడ్ న్యూస్.. ఉద్యోగులు సెలవులతో కూడిన అదనపు జీతం..

Satvika
కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం భారతదేశం పై కాస్త ఎక్కువగానే ఉందన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది చివరి వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని సూచించారు. మానసికంగా స్ట్రెస్ కు గురవుతూ ఉండటం సహజం. కొలీగ్స్ ‌తో ఇంటరాక్షన్ లేదు. అలాగే, క్లాస్ మేట్స్ తో బాతాఖానీ లేదు. కాబట్టి, చాలామంది మానసికంగా ఒంటరిగా ఫీల్ అవ్వడం సహజం..


ఎంజాయ్ కన్నా ఆరోగ్యం ముఖ్యం.. తమ కంపెనీ ఉద్యోగుల కోసం సంబంధిత కంపెనీలు అదిరిపోయే న్యూస్ ను అందించింది. ఇన్ఫోసిస్ సహా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల ఆరోగ్యంపై శ్రద్ధ కనబరుస్తున్నాయి. కొవిడ్ కేర్ సౌకర్యాల ను విస్తరించడం తో పాటు వైరస్ సోకిన వారు, ఇన్ఫెక్షన్ నుంచి కోలుకుంటున్న ఉద్యోగులకు అదనంగా పెయిడ్ లీవ్ లను ఆఫర్ చేస్తున్నాయి. వీరికి 21 రోజుల అదనపు పెయిడ్ లీవ్ ను మంజూరు చేస్తున్నాయి. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ బెంగళూరు, పుణేలో తమ ఉద్యోగుల కోసం కొవిడ్ కేర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు..


ఈ మేరకు బెంగళూరు మణిపాల్ హాస్పిటల్స్ , పూణే లో రుబీ హాల్ హాస్పిటల్ ఈ బాధ్యతల్ని పర్య వేక్షిస్తున్నారు. ఇన్ఫోసిస్ టెస్టింగ్ ల్యాబ్స్ తో కూడా అవగాహన కుదుర్చుకోవడం తో పాటు దేశ వ్యాప్తంగా తమ ఉద్యోగులు, కుటుంబ సభ్యుల చికిత్స కోసం 242 నగరాల్లోని 1490 దవాఖానలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.. కొవిడ్ సోకిన ఉద్యోగులు, వారి పై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కంపెనీ మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తింపచేస్తామని క్యాప్ జెమిని పేర్కొంది. మరో దేశీ ఐటీ దిగ్గజం విప్రో తమ బెంగళూర్ ఎలక్ట్రానిక్ సిటీ క్యాంపస్ లో ఉద్యోగుల కు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: