ఖాతాదారులకు ఝలక్ ఇచ్చిన ఎస్బిఐ..!
2018-19లో రూ.72 కోట్లు వసూలు చేయగా 2019-20లో గరిష్ఠంగా రూ.158 కోట్లు కలెక్ట్ చేసింది. దేశంలో రెండో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా 2015-20 వరకు 3.9 కోట్ల జీరో బ్యాలెన్స్ బీఎస్‌బీడీ ఖాతాల నుంచి రూ.9.9 కోట్లు చార్జీల కింద వసూలు చేసింది. మరోవైపు ఆర్‌బీఐ నిబంధనలను ఎస్‌బీఐ క్రమబద్ధంగా ఉల్లంఘించిందని ఐఐటీ బాంబే ప్రొఫెసర్ ఆశిష్ దాస్ పరిశీలించిన అధ్యయనం లో తేలింది.
బీఎస్‌బీడీ ఖాతాలపై ఛార్జీలు వసూలు చేయడంపై 2013 సెప్టెంబర్‌లో ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.పేదలకు చెందిన బీఎస్‌బీడీ ఖాతాలకు నెలలో నాలుగు కంటే ఎక్కువ విత్ డ్రాలకు సంబంధిత బ్యాంకులు తమ అభీష్టం మేరకు ఈ నిబంధనను అనుమతించవచ్చు..అయితే ఎస్‌బీఐతోపాటు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐ జారీ చేసిన ఈ నిబంధనను పక్కన పెట్టాయి. నాలుగు దాటిన ప్రతి డెబిట్ లావాదేవీపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. డిజిటల్ లావాదేవీలకు కూడా ఈ నిబంధనను వర్తింప చేస్తున్నట్లు ఐఐటి బాంబే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.. ఖాతాదారులకు అలెర్ట్.. అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ లేకుండా చూసుకోండి.. లేకుంటే బ్యాలెన్స్ లో కోత పడటం ఖాయం..