టాటా స్కై కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్..

Satvika
టాటా స్కై కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది. ఇది నిజంగానే అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి.. గతంలో కూడా ఈ డీటీహెచ్ కంపెనీ ఎన్నో ఆఫర్లను వినియోగ దారులకు అందించింది. వాటి వల్ల చాలా మంది కనెక్షన్లను తీసుకున్నారు. ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ కూడా జనాలను ఆకర్షించేందుకు మరో ప్రయత్నం అనే చెప్పాలి.


హెచ్‌డీ సెట్ టాప్ బాక్స్ మోడళ్లపై రూ.400 వరకు తగ్గింపు అందిస్తోంది. టాటా స్కై బింజ్ ప్లస్, టాటా స్కై ప్రీమియం, టాటా స్కై ప్లస్ హెచ్‌డీ, టాటా స్కై హెచ్‌డీ బాక్స్‌లపై ఆఫర్లు సొంతం చేసుకోవచ్చు.టాటా స్కై బింజ్ ప్లస్ సెట్ టాప్ బాక్స్‌పై రూ.200 తగ్గింపు ఉంది. ఈ బాక్స్‌ను రూ.2,499కు కాకుండా ఇప్పుడు రూ.2299కే పొందొచ్చు. అలాగే టాటా స్కై ప్లస్ హెచ్‌డీ బాక్స్‌పై రూ.400 తగ్గింపు పొందొచ్చు. ఇప్పుడు సెట్ ఆఫ్ బాక్స్ రూ.4,999కు కాకుండా రూ.4599కు కొనవచ్చును.


అంతేకాకుండా టాటా స్కై హెచ్‌డీ బాక్స్ కొనుగోలు చేయాలని భావించే వారు రూ.150 తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ బాక్స్‌ను రూ.1499కి కాకుండా రూ.1249కు కొనుగోలు చేయొచ్చు. ఆఫర్‌లో భాగంగా కస్టమర్లు టాటా స్కై ఎస్‌డీ బాక్స్ ధర కన్నా తక్కువ ధరకే హెచ్‌డీ బాక్స్‌ను పొందవచ్చు. ఇకపోతే ఈ ఆఫర్లను పొందాలంటే ఆన్‌లైన్‌లో టాటా స్కై వెబ్‌సైట్ ద్వారానే బాక్స్‌లు కొనుగోలు చేయాలి. రూ.200 డిస్కౌంట్ కావాలంటే టీఎస్‌కేవై200 అనే ప్రోమో కోడ్ వాడాలి. టీఎస్‌కేవై 400 ప్రోమో కోడ్ వాడితే రూ.400 తగ్గింపు వస్తుంది. టీఎస్‌కేవై 150 కోడ్ ఉపయోగిస్తే రూ.150 తగ్గింపు ఉంటుంది. మొబిక్విక్, హెచ్‌డీఎఫ్‌సీ పేజాప్ ద్వారా కొంటే రూ.50 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా డిష్ కనెక్షన్ తీసుకోవాలని భావించేవారు ఈ కనెక్షన్ ను తీసుకోండి.. కొంతవరకు ఆఫర్ ను పొందండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: