అత్యంత చవకైన టీవీఎస్ స్కూటర్ ఇదే..

Satvika
ప్రస్తుతం పెట్రోల్, డీసెల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మధ్య తరగతి వాహనదారులు బండి వేసుకొని వెళ్లడం మానేశారు. సామాన్యుడి పరిస్థితి మరి దారుణంగా మారింది. దూర ప్రయాణాలు వెళ్లాలని అనుకునేవారికి నిజంగా చేదువార్తే. ఈ మేరకు ప్రతి ఒక్కరు కూడా ఎలెక్ట్రానిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. వారి అభిరుచులకు తగ్గట్లు ఆయా కంపెనీలు కూడా సరికొత్త ఫీచర్లు ఉన్న వాహనాలను అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు.


విషయానికొస్తే.. ప్రపంచంలోనే అత్యంత చవకైన ఎలెక్ట్రిక్ స్కూటర్ ను ఢిల్లీ మార్కెట్ లోకి  తీసుకొచ్చారు. ఈ మోపెడ్‌ ను కంపెనీ రూ .39,999 కు లాంచ్ చేసింది. మీరు ఈ స్కూటర్ కొనాలనుకుంటే, దాన్ని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు మొదటగా టోకెన్ మొత్తాన్ని రూ .2,000 చెల్లించాలి. ఈ స్కూటర్‌ ను సంస్థ అధికారిక వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.


ఈ స్కూటర్ 250W ఎలక్ట్రిక్ మోటారు, 48V 12AH LiFeP04 (లిథియం అయాన్ ఫాస్ఫేట్) బ్యాటరీ తో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ ని 6 నుంచి 7 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. రూ . 40,000 కిలో మీటర్ల వరకు చెల్లుబాటు అయ్యే ఈ స్కూటర్‌ పై కంపెనీకి 2 సంవత్సరాల స్టాండర్డ్ వారంటీ లభిస్తుంది. ఈ స్కూటర్ ప్రీపెయిడ్ రోడ్‌సైడ్ ప్యాకేజీతో పాటు ఉచిత హెల్మెట్‌ను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇకపోతే ఒకే ఛార్జీ తో 60 కి.మీ. ప్రయాణం చేయవచ్చు. స్కూటర్ లోడ్ సామర్థ్యం 170 కిలోలు. స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ. స్కూటర్ టాప్ స్పీడ్ 25 కి.మీ. కొనుగోలుదారులు ఈ స్కూటర్‌ ను 5 కలర్ ఆప్షన్ల లో పొందవచ్చు. దీనిని మెటాలిక్ బ్లాక్, మెటాలిక్ రెడ్, మెటాలిక్ ఎల్లో, గన్‌మెటల్. పెర్ల్ వైట్ కలర్ ఆప్షన్ల లో అందుబాటు లో ఉన్నట్లు వెల్లడించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: