పేటీఎం ద్వారా గ్యాస్ బుక్ చేయండి... 5౦౦ రూ. క్యాష్ బ్యాక్ పొందండి!

SS Marvels
సాధారణంగా పండుగల కాలం వచ్చిందంటే బట్టలు, ఎలక్ట్రానిక్స్ మరియు వివిధ రకాల వస్తువులపై ప్రముఖ బహులార్ధక వ్యాపార సంస్థలు అదిరిపోయే ఆఫర్లు ఇస్తుంటాయి. అయితే ప్రముఖ డిజిటల్ సర్వీసెస్ యాప్ పేటీఎం కూడా తన వినియోగదారులు అందరికీ శుభవార్త తెలిపింది. మీ ఇంట్లో గ్యాస్ అయిపోయి, గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలని ఎదురుచూస్తున్నట్లయితే ఒక్క క్షణం ఆగండి.. గ్యాస్ సిలిండర్ బుకింగ్‌పై అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. దీని కోసం మీరు ఎక్కడికీ వెళ్లక్కర్లేదు. ఇంట్లో నుంచే మీరు ఈ ఆఫర్ సొంతం చేసుకోవచ్చ. డిజిటల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ పేటీఎం గ్యాస్ సిలిండర్‌పై మంచి ఆఫర్ అందిస్తోంది. పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే మంచి ఆఫర్ లభిస్తోంది. రూ.500 వరకు క్యాష్‌బ్యాక్ వస్తోంది. హెచ్‌పీ, ఇండేన్, భారత్ గ్యాస్ వంటి వాటిని మీరు బుక్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు పేటీఎం యాప్‌లోకి వెళ్లాలి. మీకు హోమ్ స్క్రీన్‌లో ఆప్షన్ కనిపించకపోతే షో మోర్‌పై క్లిక్ చేయాలి.
 
 

 ఇప్పుడు మీరు రీచార్జ్ అండ్ పే బిల్స్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు చాలా ఆప్షన్లు వస్తాయి. ఇప్పుడు బుక్ గ్యాస్ సిలిండర్‌పై క్లిక్ చేయాలి. మీరు మీ గ్యా్స్ సిలిండర్ కంపెనీని ఎంచుకోవాలి. భారత్, హెచ్‌పీ, ఇండేన్ వాటిల్లో మీ సిలిండర్ ఏదో ఓకే చేసుకోవాలి. మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదంటే ఎల్‌పీజీ ఐడీని ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత డబ్బులు కట్టాలో కూడా చూపిస్తుంది. కట్టేయాలి. అంతే మీ సిలిండర్ బుక్ అయిపోతుంది. మీరు ఇక్కడ ప్రోమో కోడ్ ఎంటర్ చేయాలి. లేదంటే క్యాష్‌బ్యాక్ రాదు. ఫస్ట్ ఎల్‌పీజీ అనే కోడ్ ఎంటర్ చేసిన తర్వాతనే బిల్లు చెల్లించాలి. పేటీఎంలో తొలిసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: