కొత్త ఇల్లు కొనాలనుకునేవారికి కేంద్రం అదిరిపోయే ఆఫర్..

Satvika
కొత్త ఇల్లును కట్టుకోవాలని లేదా కొనాలని చాలా మంది అనుకుంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అటువంటి ఆలోచన చేయాలంటే చాలా మంది భయపడుతున్నారు. అందుకు కారణం పెరిగిన ధరలు కావొచ్చు.. లేదా కట్టడానికి కావాల్సిన స్థలం ఖర్చు కావొచ్చు.. చిన్న ఇల్లు కట్టుకోవాలని అనుకున్నా కూడా బోలెడు డబ్బులు అవుతున్నాయి. దాంతో ఇల్లు కట్టుకోవాలని అనుకునేవాళ్లు ఆలోచన పక్కన పెట్టేసి ఎంతో కొంత అయిన పర్వాలేదని రెంటు కు అద్దె ఇళ్ళల్లో ఉంటారు. అలాంటి వారి కళను కేంద్ర ప్రభుత్వం నిజం చేయబోతుంది.. వారికి అదిరిపోయే ఆఫర్ ను అందిస్తుంది..

అంతేకాదు దానితో పాటుగా రియల్ ఎస్టేట్ రంగంలో కొన్ని మెళుకువలు కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. వివరాల్లోకి వెళితే..రూ.2 కోట్లలోపు ఇళ్లకు ఇది వర్తిస్తుంది. ఇల్లు కొంటే 20 శాతం ఇన్‌కమ్ ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది. 2021 జూన్ 30 వరకు ఈ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం స్టాంప్ డ్యూటీ, అగ్రిమెంట్ వ్యాల్యూ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని డబుల్ చేసింది. ఇలా చేయడం వల్ల చాలా మందికి సొంతిల్లు కట్టుకోవాలని అనుకునేవారికి సులువుగా ఉంటుందని అంటున్నారు.

మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పై ఇటు ఇంటి కొనుగోలుదారలుకు అటు హౌసిండ్ డెవలపర్లకు ప్రయోజనం కలుగనుంది. ఇన్‌కమ్ ట్యా్క్స్ యాక్ట్‌లోని సెక్షన్ 43 సీఏ కింద సర్కిల్ రేటు అగ్రిమెంట్ వ్యాల్యూ  మధ్య వ్యత్యాసాన్ని 10 శాతం నుంచి 20 శాతానికి పెంచుతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.రూ.2 కోట్లలోపు ఇళ్లను కొనే వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 56 ఎక్స్ కింద 20 శాతం వరకు రిబేట్ లభిస్తుంది.ఇలా చేయడం వల్ల తక్కువ ధరకే ఇళ్లు లభిస్తాయి. ఇంకా పన్ను మినహాయింపు కూడా పొందొచ్చు. ఈ నిర్ణయం తో మోదీ సర్కార్ పై మరోసారి ప్రశంసలు వెలు వెత్తుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: