ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియాకి పెద్ద షాక్ ఇచ్చిన జియో!
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన గణాంకాల ప్రకారం... జూన్ నెలలో ఎయిర్టెల్ నెట్వర్క్ 11 లక్షల 20 వేల వినియోగదారులను కోల్పోగా... వొడాఫోన్ ఐడియా ఏకంగా 48 లక్షల 20 వేల వినియోగదారులను కోల్పోయింది. ప్రస్తుతం భారతదేశంలో ఎయిర్టెల్ నెట్వర్క్ 31 కోట్ల 66 లక్షల వినియోగదారులతో రెండో స్థానంలో ఉండగా... వొడాఫోన్ ఐడియా 30 కోట్ల 51 లక్షల వినియోగదారులతో మూడవ స్థానంలో నిలిచింది. అయితే కొత్తగా లక్షల మంది వినియోగదారులు తమ నెట్వర్క్ ని సబ్ స్క్రైబ్ చేసుకోవడం తో జియో మార్కెట్ వాటా 34.33 శాతం నుండి 34.82 రెండు శాతానికి పెరిగింది.
11 లక్షల 20 వేల వినియోగదారులను కోల్పోవడంతో భారతీ ఎయిర్టెల్ యొక్క మార్కెట్ వాటా 27.78 శాతం నుండి 27. 76 శాతానికి తగ్గింది. వోడాఫోన్ ఐడియా నెట్వర్క్ మార్కెట్ వాటా 27.09 శాతం నుండి 26.75 శాతానికి తగ్గింది. అయితే యాక్టివ్ యూజర్ల విషయానికొస్తే ఎయిర్టెల్ నెట్ వర్కే అగ్రస్థానంలో నిలుస్తోంది. ఎయిర్టెల్ నెట్వర్క్ కి సబ్ స్క్రైబ్ చేసుకున్న 100 మంది వినియోగదారులలో 98 మంది వినియోగదారులు అదే నెట్వర్క్ ని ఇప్పటికీ వినియోగిస్తున్నారు. వొడాఫోన్ ఐడియా నెట్ వర్క్ కి సబ్ స్క్రైబ్ చేసుకున్న 100 మంది వినియోగదారులలో 89 మంది వినియోగదారులు అదే నెట్వర్క్ ని ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఇక ఆ రిలయన్స్ జియో నెట్ వర్క్ కి సబ్ స్క్రైబ్ చేసుకున్న 100 మంది వినియోగదారులలో కేవలం 78 మంది వినియోగదారులు మాత్రమే అదే నెట్వర్క్ ని వినియోగిస్తున్నారు. అంటే జియో నెట్వర్క్ పై వినియోగదారుల్లో ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతోంది. ఏది ఏమైనా ఎయిర్టెల్ నెట్వర్క్ తమ వినియోగదారులకు నిరంతరాయంగా మంచి సేవలను అందిస్తోంది. అందుకే నూటికి 98.15 శాతం మంది వినియోగదారులు ఎయిర్టెల్ నెట్వర్క్ నే ఇప్పటికీ వాడుతున్నారు.