పుంజుకున్న నైక్ షూస్ అమ్మకాలు

Suma Kallamadi
ప్రఖ్యాత నైక్ షూస్ కంపెనీ పై కరోనా ప్రభావం చూపడంతో ఆ కంపెనీ యొక్క షేర్లు విపరీతంగా పడిపోయాయి. ఇంటి నుండి బయటకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గడంతో ఇక కొత్తగా షూస్ కొనుగోలు చేసే వారి సంఖ్య దారుణంగా పడిపోవడంతో నైక్ షూస్ కంపెనీ అమ్మకాలపై తీవ్ర ప్రభావం పడింది. అయితే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న నేపథ్యంలో ప్రజలు బయటికి రావడానికి ధైర్యం చేస్తున్నారు. అలాగే షూస్ తో సహా అన్ని కొనుగోలు చేస్తున్నారు. జాగ్రత్తలు పాటిస్తూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు.


అయితే ఈ నేపథ్యంలో మంగళవారం రోజు మార్కెట్ లో ముగిసే నాటికి 1.8 శాతం షేర్ విలువ పెరిగిందని నైక్ షూస్ కంపెనీ వెల్లడించింది. ప్రస్తుత కరోనా  కాలంలో చాలా షూ కంపెనీస్ దుకాణాలను తెరిచేందుకు ధైర్యం చేయకపోవడంతో వినియోగదారులు అందరూ కూడా ఆన్లైన్ లో షూస్ కొనుగోలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా నైక్ షూస్ వెబ్ సైట్ ద్వారా ఆర్డర్ లు చేస్తున్నారు ప్రజలు. ప్రముఖ వాల్ స్ట్రీట్ జర్నల్ విశ్లేషకుడు చెప్పిన ప్రకారం నైక్ షూస్ కంపెనీ యొక్క అమ్మకాలు 75 శాతం పెరిగాయట. నైక్ షూస్ కంపెనీ తమ మూడు వంతుల రెవిన్యూ లో ఒక భాగం రెవిన్యూ ని కేవలం ఆన్లైన్ మార్కెట్ ద్వారానే సాధిస్తోంది.


ఈ సంవత్సరం యొక్క నాలుగో భాగంలో చైనాలో,  ఉత్తర అమెరికాలో ఇంకా పలు దేశాలలో నైక్ షూస్ కి బాగా డిమాండ్ పెరిగి పోయిందని కంపెనీ తెలిపింది. ప్రస్తుతం కస్టమర్ల అభిరుచికి తగ్గట్టుగా వందల రకాల స్పోర్ట్స్ షూస్, స్నిక్కెర్స్ తయారు చేయడానికి నడుం బిగించింది నైక్ షూస్ సంస్థ. ఇకపోతే నైక్ షూస్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా జరిగే కొన్ని ఉద్యమాలకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ ప్రజలను ఆకట్టుకుంటోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: