ఈ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ స్కీమ్స్‌తో మీకు ఎంత లాభమో తెలుసా..?
అయితే పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్ లో పెట్టుబడి పెడితే 5.8శాతం చొప్పున వడ్డీ లభిస్తుందన్నారు. పోస్ట్ ఆఫీస్ ఫిక్స్డ్ డిపాజిట్లో ఒకటి నుంచి మూడు సంవత్సరాలకు వడ్డీ రేటు 5.5శాతంగా ఉందన్నారు. ఐదు సంవత్సరాల ఫిక్స్డ్ డిపాజిట్పై వడ్డీ రేటు 6.7శాతంగా ఉంది.పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్: పోస్టల్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో డిపాజిట్లపై సంవత్సరానికి 7.1శాతం వడ్డీ లభిస్తుందన్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.500 నుంచి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చున్నారు. ఈ స్కీమ్‌లో డబ్బు మొత్తాన్ని ఒకేసారి, లేదా 12 వాయిదాల్లో జమ చేయవచ్చు. దీనికి మెచ్యూరిటీ 15 సంవత్సరాలు. దీనికి కూడా ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 సి ప్రకారం పన్ను మినహాయింపు ఉంది.
ఇక సుకన్య సమృద్ధి యోజన: సుకన్య సమృద్ధి యోజనలో పెట్టుబడిపై సంవత్సరానికి 7.6వడ్డీ లభిస్తుంది. ఆడపిల్లలకు 21 సంవత్సరాలు వచ్చిన తరువాతే డబ్బు తీసుకోవచ్చునన్నారు. ఇందులో రూ.250తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ప్రతి సంవత్సరం వెయ్యి రూపాయల నుంచి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అదనంగా పన్ను మినహాయింపులు కూడా ఉంటాయి. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్: పోస్టల్ సేవింగ్స్‌లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ మంచి పెట్టుబడి ఎంపిక. ఈ పథకంలో మెచూరిటీ ఐదు సంవత్సరాలు. ఎన్ఎస్సీపై ప్రస్తుత వడ్డీ రేటు 6.8శాతంగా ఉందన్నారు. ఈ వడ్డీ ప్రతి సంవత్సరం పెరుగుతుందని నిపుణులు తెలిపారు.