పొదుపు పథకాల్లో డబ్బులు జమ చేస్తున్నవారికి ఊరట..!

Suma Kallamadi
పీపీఎఫ్ లాంటి పొదుపు పథకాల్లో డబ్బులు క్లెయిమ్ చేసుకునే కస్టమర్లకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్స్ ఊరటను ఇచ్చింది. ఇక కొత్త సర్క్యులర్ జారీ చేశారు. అంతేకాదు పాలసీ క్లెయిమ్ సందర్భంలో సాక్షుల ఫిజికల్ ప్రజెన్స్ అవసరం లేదని నూతన సర్క్యులర్ జారీ చేసింది. ఇది పిపిఎఫ్‌తో పాటు ఇతర పోస్టాఫీసు పొదుపు పథకాలకు వర్తిస్తుందని పేర్కొన్నారు.

ఇక ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సిబిఎస్/ నాన్–సిబిఎస్ పోస్ట్ ఆఫీస్లతో సహా అన్ని పోస్టాఫీసుల్లో ఈ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. నూతనంగా జారీ చేసిన సర్క్యులర్లో సూచించినట్లుగా సాక్షుల ఐడి, అడ్రస్ ప్రూఫ్‌ను జతచేయాల్సి ఉంటుంది. ఐడెంటిటీ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడి కార్డు, రేషన్ కార్డ్, పోస్ట్ ఆఫీస్ ఐడి కార్డు, కేంద్ర/ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైతే పిఎస్‌యూ ఐడి కార్డు, రాష్ట్ర ప్రభుత్వ అధికారి సంతకంతో జారీ చేసిన జాబ్ కార్డు, పాన్ కార్డ్, గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుండి పొందిన చిరునామా సర్టిఫికెట్ జత చేయాలని తెలిపారు.

అంతేకాకుండా అడ్రెస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు ఐడి కార్డు, రేషన్ కార్డు, చిరునామా ఉన్న ఫోటో ఐడెంటిటీ కార్డు (కేంద్ర ప్రభుత్వం/ పిఎస్యు లేదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు), గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుండి పొందిన చిరునామా సర్టిఫికెట్, ప్రస్తుత చిరునామాతో ఉన్న శాలరీ స్లిప్, పేరు, చిరునామా వివరాలను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసిన లేఖ, విద్యుత్తు, టెలిఫోన్, పోస్ట్-పెయిడ్ మొబైల్, పైప్డ్-గ్యాస్, వాటర్ బిల్లు (2 నెలల్లోపు ఉన్నవి), ఆస్తి లేదా మున్సిపల్ టాక్స్ రిసిప్ట్, బ్యాంక్ లేదా పోస్ట్ పాస్బుక్ /చిరునామాతో ఉన్న స్టేట్మెంట్, పేరు, చిరునామా వివరాలను కలిగి ఉన్న జాతీయ జనాభా రిజిస్టర్ జారీ చేసిన లేఖ ఇవ్వొచ్చునని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: