ఆ బ్యాంకులో జీరో అకౌంట్ ఓపెన్ చేస్తే.. అదిరిపోయే లాభం..!

Suma Kallamadi
ప్రస్తుతం బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికీ అవసరం. ఇక ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్‌తో చాలా పనులు అనుసంధానమై ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల ప్రయోజనాల దగ్గరి నుంచి చాలా వంటి వాటికి బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే. అయితే బ్యాంక్ అకౌంట్ తెరవాలంటే డబ్బుల ఉండాలి. అయితే కొన్ని బ్యాంకులు జీరో బ్యాలెన్స్ అకౌంట్ సర్వీసులు కూడా అందిస్తున్నాయని నిపుణులు తెలిపారు.
ఇక దేశీ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా బేసిక్ సేవింగ్స్ బ్యాక్ డిపాజిట్ అకౌంట్ సేవలు అందిస్తోందని తెలిపారు. ఈ అకౌంట్‌ ఓపెన్ చేస్తే రూపే ఏటీఎం కార్డు లభిస్తుందని నిపుణులు తెలిపారు. ఇక నెలకు 4 సార్లు ఏటీఎం నుంచి చార్జీలు లేకుండా డబ్బులు తీసుకోవచ్చునన్నారు. ఈ అకౌంట్లపై 2.75 శాతం వడ్డీ వస్తుందని తెలిపారు.
అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ కూడా ఆన్‌లైన్ సేవింగ్స్ అకౌంట్ అందిస్తోందని తెలిపారు. దీని ద్వారా అన్‌లిమిటెడ్ ఏటీఎం ట్రాన్సాక్షన్ సేవలు లభిస్తాయన్నారు. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సేవలు ఉచితం. ఆధార్, పాన్ కార్డు సాయంతో ఆన్‌లైన్‌లోనే ఖాతా తెరవొచచు. 6 శాతం వరకు వడ్డీ పొందొచ్చునని తెలిపారు.
ఇక కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా 811 డిజిటల్ బ్యాంక్ అకౌంట్ సర్వీసులు అందిస్తోందన్నారు. ఇందులో ఎలాంటి మినిమమ్ బ్యాలెన్స్ కలిగి ఉండాల్సిన పనిలేదన్నారు. వర్చువల్ డెబిట్ కార్డు పొందొచ్చునన్నారు. దీని ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేయొచ్చునన్నారు. బిల్లులు, డీటీహెచ్ రీచార్జ్ వంటివి నిర్వహించొచ్చు అని తెలిపారు. అకౌంట్‌పై 4 శాతం వరకు వడ్డీ లభిస్తుందని తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ సర్వీసులు అందిస్తోందన్నారు. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా. ఏటీఎం, పాస్‌బుక్ వంటివి ఉచితంగా పొందొచ్చు. ఈ ఖాతాపై 3.5 శాతం వరకు వడ్డీ వస్తుందని నిపుణులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: