గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రాలేదా.. ఇలా చెక్ చేసుకోండి..!
అంతేకాక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలను బట్టి ఎల్పీజీ సిలిండర్ల ధరలు మారుతాయని తెలిపారు. ఇక ప్రతీ నెలా ఎల్పీజీ సిలిండర్ ధరల్ని సవరిస్తుంటాయని తెలిపారు. ఆయిల్ కంపెనీలు. అందుకే సిలిండర్ ధరల్లో హెచ్చుతగ్గులుంటాయని అన్నారు. ఇక సబ్సిడీ విషయానికి వస్తే కస్టమర్ సిలిండర్ తీసుకున్న కొద్దిరోజుల్లోనే సబ్సిడీ బ్యాంకు అకౌంట్లో జమ అవుతుంది. మీకు వరుసగా రెండు నెలలు సబ్సిడీ డబ్బులు రాకపోతే ఎల్పీజీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవాలని అన్నారు.
ఐఓసీఎల్, హెచ్‌పీ, బీపీసీఎల్ కంపెనీల నుంచి మీరు సిలిండర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక ఎల్పీజీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవడానికి వేర్వేరు వెబ్‌సైట్స్ చూడాల్సిన అవసరం లేదని తెలిపారు. https://mylpg.in/ వెబ్సైట్లో మీ సబ్సిడీ స్టేటస్ తెలుసుకోవచ్చునని తెలిపారు. ఐఓసీఎల్, హెచ్‌పీ, బీపీసీఎల్ కంపెనీలకు సంబంధించిన వివరాలన్నీ ఈ వెబ్సైట్లో ఉంటాయని తెలిపారు. మరి మీకు సబ్సిడీ రాకపోతే స్టేటస్ చెక్ చేసుకునేందుకు ఈ స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందని తెలిపారు.
అయితే https://mylpg.in/ వెబ్సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలోనే మీ 17 అంకెల ఎల్పీజీ ఐడీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ఎల్పీజీ ఐడీ తెలుస్తుందని తెలిపారు. ఆ తర్వాత మీ ఎల్పీజీ ఐడీని ఎంటర్ చేయండి. మీ ఇమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో రిజిస్టర్ చేసుకొండి. మీ ఇమెయిల్ ఐడీకి యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది.