ఎల్ఐసీ పాలసీ ప్రీమియం చెల్లించి రూ.2,500 వరకు పొందండి ఇలా..!

Suma Kallamadi
మీరు ఎల్ఐసీ పాలసీ ఉందా. అయితే కరోనా క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థికంగా పాలసీ ప్రీమియం కట్టలేకపోతున్నారా..అయితే ఇది మీకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC. స్పెషల్ రివైవల్ క్యాంపైన్‌ను ప్రారంభించింది. ఇది ఆగస్ట్ 10 నుంచి అక్టోబర్ 9 వరకు అంటే రెండు నెలలు స్పెషల్ రివైవల్ క్యాంపైన్‌ కొనసాగుతుంది.

అంతేకాకుండా పలు కారణాల వల్ల ప్రీమియం చెల్లించనివారు, పాలసీలు ల్యాప్స్ అయినవారు తమ పాలసీలను రెన్యువల్ చేయించుకోవచ్చునని నిపుణులు వెల్లడించారు. ప్రీమియం చెల్లించడం ఆపేస్తే రిస్క్ కవర్ ఆగిపోతుందని తెలిపారు. అందుకే పాలసీహోల్డర్లు రిస్క్ కవర్ కొనసాగించుకోవడానికి వీలుగా తరచూ స్పెషల్ రివైవల్ క్యాంపైన్‌‌ను నిర్వహిస్తూ ఉంటుంది ఎల్ఐసీ. ఇప్పుడు మరోసారి ఈ క్యాంపైన్ ప్రారంభించిందని తెలిపారు. పాలసీ ల్యాప్స్ అయినట్టైతే అక్టోబర్ 9 వరకు రెన్యువల్ చేయించుకోవచ్చునన్నారు.

అయితే పాలసీ ప్రీమియం చెల్లించడం ఆపేసిననాటి నుంచి ఐదేళ్లలలో పాలసీ రివైవ్ చేయొచ్చునన్నారు. ఇది కూడా ఎంపిక చేసిన పాలసీలకు నియమనిబంధనలకు అనుగుణంగా రివైవల్ ఉంటుందని తెలిపారు. ఎల్ఐసీ సూచించిన పాలసీలను మాత్రమే రెన్యువల్ చేసుకోవచ్చునన్నారు. పాలసీహోల్డర్లు ప్రీమియంతో పాటు లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఎయితే ఎల్ఐసీ లేట్ ఫీజులో కన్సెషన్ ఇస్తోందన్నారు.

ఇక ప్రీమియం రూ.1,00,000 లోపు ఉంటే లేట్ ఫీజులో 20% గరిష్టంగా రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుందని తెలిపారు. రూ.1,00,001 నుంచి రూ.3,00,000 ప్రీమియం ఉంటే ఆలస్య రుసుములో 25% గరిష్టంగా రూ.2,000 వరకు, ప్రీమియం రూ.3,00,001 పైన ఉంటే లేట్ ఫీజులో 30% గరిష్టంగా రూ.2,500 వరకు తగ్గింపు పొందొచ్చునన్నారు. ఒకవేళ మీరు మీ పాలసీని రివైవ్ చేయాలనుకుంటే దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీసులో సంప్రదించొచ్చునని తెలిపారు. మీ పాలసీని రెన్యువల్ చేయిస్తే గతంలో పాలసీపై ఉన్న బెనిఫిట్స్ ఎప్పట్లాగే పొందొచ్చు. రిస్క్ కవర్ కూడా కొనసాగుతుందన్నారు. బోనస్‌, ఇతర బకాయిలు క్రెడిట్ అవుతాయని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: