అదరగొట్టిన స్టాక్ మర్కెట్స్..!

Suma Kallamadi

నిన్నటి లాభాలు కొనసాగింపుగా నేడు కూడా దేశీయ స్టాక్ మర్కెట్స్ లాభాల్లో దూసుకెళ్లాయి. ఇకపోతే నేటి మొదటి నుండి బాగానే లాభాల్లో పయనించిన స్టాక్ మార్కెట్లు ఎక్కడ వెనక్కి చూడకుండా లాభాల వైపు పయనించాయి. ఇక నేడు మార్కెట్ సమయం ముగిసే సరికి సెన్సెక్స్ 477 పాయింట్లు లాభపడి 38,528 వద్ద ముగిసింది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 138 పాయింట్లు బలపడి 11,385 వద్ద ముగిసింది.



ఇక నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఒక్క ఫార్మా రంగం తప్పించి మిగతా నిఫ్టీ సెక్టోరల్స్ అన్ని లాభాల వైపు నడిచాయి. ఈరోజు ప్రధానంగా నిఫ్టీ రియాల్టీ 4 శాతం పైగా లాభపడింది. అలాంటి నిఫ్టీ బ్యాంకు కూడా 2.2% లాభపడింది. ఇక నేడు నిఫ్టీ 50 లో లాభనష్టాల విషయానికొస్తే.. గ్రసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్, mahindra BANK' target='_blank' title='కొటక్ మహీంద్రా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కొటక్ మహీంద్రా, జెఎస్డబ్ల్యు స్టీల్, ఐసిఐసిఐ బ్యాంక్ అత్యధిక లాభాలు గడించిన కంపెనీ షేర్స్ అత్యధిక లాభపడిన లిస్ట్ లో ముందు ఉన్నాయి. ఇక ఇందులో గ్రసిం 6 శాతం పైగా లాభపడింది. ఇక మరోవైపు బీపీసీల్, టెక్ మహీంద్రా, సిప్లా, గెయిల్, ఐఓసి కంపెనీ షేర్లు నష్టపోయాయి. ఇందులో ముఖ్యంగా బీపీసీల్ 1 శాతం పైగా నష్టపోయింది.



ఇక నేడు హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు ఏకంగా రూ. 1040 పెరిగి రూ. 56,530 వద్ద ముగిసింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు రూ. 970 రూపాయలు పెరిగి రూ. 51,670 కు చేరుకుంది. ఇక బంగారం తో పాటు వెండి ధర కూడా చూస్తే... ఏకంగా ఒక్కరోజే కేజీ వెండి ధర రూ. 2200 రూపాయలు పెరిగి రూ. 71,100 వద్ద ముగిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: