లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్...!

Suma Kallamadi

నేడు దేశీ స్టాక్ మార్కెట్ లాభాల బాట పట్టింది. వరుసగా మూడో రోజు బెంచ్ మార్క్ సూచీలన్నీ లాభాల వైపు నడిచాయి. ముఖ్యంగా నిఫ్టీ 11 వేల మార్కును దాటేసింది. నేడు మార్కెట్ మొదలైనప్పటి నుండి లాభాల వైపు నడిచింది. నేను మార్కెట్ సమయం ముగిసే సరికి సెన్సెక్స్ 329 పాయింట్లు బలపడి 37419 వద్ద నిలిచింది. అలాగే నిఫ్టీ కూడా 121 పాయింట్లు బలపడి 11022 వద్ద ముగిసింది. ఇందులో ముఖ్యంగా ఫార్మా కంపెనీకి సంబంధించిన షేర్లు నష్టపోగా, బ్యాంకు నిఫ్టీ కి సంబంధించిన షేర్లు లాభపడ్డాయి. మరిముఖ్యంగా ఐటీ షేర్లు ప్రధానంగా 2.6% బలపడ్డాయి.

 


ఇంకా డెరివేటివ్స్ లో మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్ సంస్థ ఏకంగా పది శాతం పైగా లాభపడింది. ఇక నేడు మొత్తంగా స్టాక్ మార్కెట్లో 1520 కంపెనీల షేర్లు లాభపడగా, 1167 కంపెనీల షేర్లు నష్టాల బాట పట్టాయి. ఇక నేడు నిఫ్టీ 50 లాభనష్టాల విషయం చూస్తే... ముఖ్యంగా బ్రిటానియా, బజాజ్ ఫైనాన్స్, హెచ్ సిఎల్ టెక్, బజాజ్ ఫిన్ సర్వ్, యుపిఎల్ కంపెనీల షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. మరోవైపు సన్ ఫార్మా, సిప్లా, జి ఎంటర్టైన్మెంట్, బిపిసిఎల్, ఎన్టిపిసి కంపెనీల షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. 

 


ఇక ఫీచర్స్ లో ఆగస్టు 5 నాటికి బంగారం విలువ 63 రూపాయలు నష్టపోయి 48 904 వద్ద ముగిసింది. అలాగే సెప్టెంబర్ 4 నాటికి కేజీ వెండి 131 రూపాయి లాభపడి 53030 రూపాయల వద్ద ముగిసాయి. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకం విలువ అమెరికా డాలర్ తో పోలిస్తే 20 పైసలు నష్టపోయి 74.86 వద్ద ట్రేడ్ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: