ఒకేసారి నాలుగు ఫోన్లని లాంచ్ చేయనున్న నోకియా..! పూర్తి వివరాలు మీకోసం...!
మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ ఈవెంట్ లో నోకియా నాలుగు ఫోన్లను లాంచ్ చేయనున్నట్లు సమాచారం అందుతోంది. వాటి విషయానికి వస్తే నోకియా 8.2 5జీ, నోకియా 5.2, నోకియా 1.3, నోకియా ఒరిజినల్ స్మార్ట్ ఫోన్ ఈ ఈవెంట్లో మార్కెట్ లోకి రానున్నాయి. అయితే నోకియా పంపిన ఇన్విటేషన్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీన ఈ కార్యక్రమం మొదలు కానుంది.
ఈ నోకియా 8.2 5జీ వెర్షన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765 ప్రాసెసర్ తో పనిచేయనుందని లీకుల ద్వారా విషయం తెలుస్తోంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ వేరియంట్లను లాంచ్ చేయనున్నాట్లు కొంతవరకు సమాచారం అందుతుంది. 32 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సెల్ఫీ కెమెరా, వెరకవైపు మూడు కెమెరాల సెటప్ ఇందులో ఉన్నాయని తెలుస్తోంది. 3,500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను కూడా ఇందులో మనకి అందించనున్నారు. ఈ ఫోన్ అసలు ధర రూ.36 వేలకు కాస్త అటూఇటుగా ఉంటుందని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇక నోకియా 5.2 విషయానికి వస్తే, ఇది మిడ్ రేంజ్ లో లాంచ్ కానుందని సమాచారం. 6.2 అంగుళాల డిస్ ప్లే, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇందులో అందుబాటులో ఉంటాయి. 4 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో ఉండే అవకాశం ఉంది. ఫోన్ ధర రూ.13,500గా ఉండనుందని మనకు తెలుస్తోంది.
ఇంక అలాగే నోకియా 1.3 ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ గా మార్కెట్ లోకి రాబోతుంది. కేవలం 1 జీబీ ర్యామ్, 8 జీబీ స్టోరేజ్ తో ఈ ఫోన్ లాంచ్ కానుందని అసలు సమాచారం. అయితే ఇందులో వెనకవైపు 13 మెగా పిక్సెల్ కెమరా, ముందువైపు 5 మెగా పిక్సెల్ కెమెరా అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ ధర రూ.6,200గా ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే నోకియా ఒరిజినల్ స్మార్ట్ ఫోన్ గురించి ఎటువంటి సమాచారం లీక్ ఎక్కడ అవ్వలేదు.