జియో నుంచి మరో అద్భుతమైన ఫీచర్.. నెట్‌వర్క్ లేకపోయినా కాల్స్ చేసే ఛాన్స్...!

Suma Kallamadi

ప్రస్తుత ప్రపంచంలో  టెక్నాలజీ రోజు రోజుకి బాగా పెరిగిపోతుంది. 2జీ, 3జీ, 4జీ దాటేసి ఇప్పుడు 5జీ వైపు పరుగులు పెడుతుంది ప్రపంచం. ఇందుకు అనుకుణంగా  రిలయెన్స్ జియో తమ వినియోగదారులకు సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొని వస్తుంది. ఆ సర్వీసుల్లో  VoWiFi   ఫీచర్ ద్వారా నెట్‌వర్క్ లేకుండ  కూడా కాల్స్ చేసే సదుపాయం కలిపిస్తుంది. ఇక  ఈ కొత్త  ఫీచర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందామా మరి.. 

 


సాధారణంగా మొబైల్ యూజర్లు స్లో నెట్‌వర్క్ సమస్యను చాల ఎక్కువ ఉండడం సహజంగా మారింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నెట్‌వర్క్ సరిగ్గా లేకపోవడం వల్ల కాల్ డిస్కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందు కోసమే మొబైల్ కంపెనీలు సరికొత్త సేవల్ని తమ కస్టమర్లకు ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. అలాంటి వాటిలో ఒకటి  వాయిస్ ఓవర్ వైఫై-VoWiFi ఫీచర్. ఇంకో వైపు ఎయిర్‌టెల్ కూడా ఇలాంటి సేవల్ని కస్టమర్లకు పరిచయం చేస్తుంది అంటే నమ్మండి. ప్రస్తుతంనికి  జియో ఈ ఫీచర్‌ను మహారాష్ట్రలో పరీక్షలు చేయడం జరుగుతుంది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫోన్‌లో నెట్‌వర్క్ స్లో గా ఉన్నాకూడా  కాల్స్ సులభంగా చేసుకోవచ్చు.

 

 

ఇందుకు ముఖ్యంగా వైఫై లేదా హాట్‌స్పాట్‌కు కనెక్ట్ అయి ఉంటే సరిపోతుంది... ఫోన్‌లో అసలు నెట్‌వర్క్ అవసరం లేకుండగానే   కాల్స్ చేయడం కేవలం ఈ  ఫీచర్ ద్వారా సాధ్యం అని ప్రముఖులు తెలుపుతున్నారు. టెలికాం కంపెనీలు దేశంలోని ప్రధాన నగరాల్లో VoWiFi ఫీచర్‌ని  ముందుగా తీసుకొని రావడం జరుగుతుంది.  ఈ ఫీచర్ ప్రతి స్మార్ట్‌ఫోన్లల్లో ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లోని కేవలం సెట్టింగ్స్‌ మారిస్తే సరిపోతుంది.

 

కేవలం వైఫై నెట్‌వర్క్ ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం మాత్రం ప్రయోగ దశలో ఉన్న ఈ ఫీచర్ పూర్తిస్థాయిలో విజయం సాధిస్తే మాత్రం  జియో యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొని రావడానికి సిద్ధంగా ఉంది జియో.  ప్రస్తుతం మాతరం యాపిల్, వన్‌ప్లస్, షావోమీ, సాంసంగ్  స్మార్ట్‌ఫోన్లల్లోనే మాత్రం ఈ ఫీచర్ అందుబాటులో ఉంది అని అధికారులు తెలుపుతున్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: