డేటా వాడకుండా సినిమాలు డౌన్ లోడ్ చేసుకొండి - ఐడియా బంపర్ ఆఫర్

KSK

సాధారణంగా మొబైల్ ఫోన్ లో ఏదైనా సినిమా గానీ పాట ని గానీ డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే ఏం చేస్తాం ? డేటా ఆన్ చేసుకుంటాం లేదా వైఫై ని ఉపయోగిస్తాం. కానీ అవేమీ అక్కర్లేదు అని కొత్త ఆసక్తికర చర్చ కి తెర లేపింది ఐడియా. సినిమాని డౌన్ లోడ్ చేసుకోవాలి అంటే బోలెడు డేటా ఖర్చు అవుతుంది అని మనందరికీ తెలిసిందే కానీ ఐడియా మాత్రం ఇవేమీ ఒద్దు అంటోంది. ఒక పక్క జియో ఉచిత డేటా ఆఫర్ లు ఇచ్చేస్తున్న సమయం లో ఐడియా సెల్యులార్ సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. తాము అందిస్తున్న మూవీ క్లబ్ యాప్ ని డౌన్ లోడ్ చేసుకుంటే దాని ద్వారా కావాల్సినన్ని పాటలనూ , సినిమాలనూ డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని ఆ సంస్థ ప్రకటించింది. ఈ యాప్ తో ఒకేసారి రెండు వీడియోలను కూడా చూడవచ్చని ఐడియా పేర్కొంది. కాగా, ఈ యాప్ ప్రాచుర్యంలోకి వచ్చిన తరువాత కొంత చార్జీలను విధించవచ్చని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: