ఫ్లైట్ ఎక్కాలని ఉందా ? సూపర్ ఆఫర్ ఇదిగో

KSK

ఫ్లైట్ ప్రయాణాలు ఎక్కువగా చేసేవారికి ఇది బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. బెంగళూరు నుంచి విశాకపట్నానికి వెళ్ళడానికి ఆర్టీసీ గరుడ 1914 రూపాయలు చార్జీ వసూలు చేస్తూ ఉండగా 18 గంటల పాటు ప్రయాణం చెయ్యాల్సి ఉంటుంది. అయితే అదే దూరాన్ని మాతో కలిసి ప్రయాణం చెయ్యండి కేవలం పన్నెండు వందలకే అంటోంది ఎయిర్ ఏషియా.బెంగళూరు - విశాఖ మధ్య రూ. 1,199కి (అన్ని పన్నులూ కలుపుకుని) విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. సెప్టెంబర్ 11లోగా కొనుగోలు చేసే టికెట్లపై వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 6 నుంచి అక్టోబర్ 28 మధ్య ప్రయాణం పెట్టుకోవాలని సూచిస్తోంది. గౌహతీ ఇంపాల్ ల మధ్య ఆరోన్దలూ, బెంగళూరు కొచ్చి ల మధ్య 900 , గోవాకి పదకొండు వందలూ , డిల్లీ కి 1300 లూ రేటు పెట్టింది. ఆఫర్ లో భాగంగా ఎన్ని సీట్లను విక్రయించనున్నారన్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు. కోచి నుంచి కౌలాలంపూర్ కు రూ. 3,399కే ఒకవైపు టికెట్ ను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: