సూపర్ స్టార్ 171 వ సినిమా టైటిల్ టీజర్ విడుదల!

Purushottham Vinay
కోలీవుడ్ టాప్ డైరెక్టర్ లలో ఒకడైన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఆలిండియా సూపర్ స్టార్ రజినీకాంత్ తన 171వ సినిమాని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా నుంచి రజినీకాంత్ ఫస్ట్ లుక్ ని విడుదల చేసిన మేకర్స్..ఆడియన్స్ లో మంచి బజ్ ని కూడా క్రియేట్ చేసారు. తాజాగా నేడు ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ టీజర్ ని ఆడియన్స్ ముందుకు తీసుకు రావడం జరిగింది. సూపర్ స్టార్ ఫ్యాన్స్ దీన్ని చూసి పిచ్చ పిచ్చగా ఫిదా అవుతున్నారు. 


కాగా ఈ చిత్రానికి ‘కూలీ’ అనే టైటిల్ ని టీం ఖరారు చేసారు.ఇక జైలర్ తో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సినిమాతో కూడా దాన్ని తలదన్నే మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం అంటున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: