ప్రజాయుద్దనౌక, బాధిత, పీడిత వర్గాల గాయకుడు ఇంకా విప్లవకారుడు అయిన
శ్రీ గద్దర్ గారు ఆకస్మిక మరణం చెందారు.అనారోగ్యంతో అపోలో అస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.గద్దర్ గారి అసలు పేరు
గుమ్మడి విట్టల్ రావు.1949 తూప్రాన్‌లో ఆయన జన్మించారు. గద్దర్‌గా ఎంతో ప్రసిద్ధి చెందారు. ఈయన ఒక భారతీయ కవి, విప్లవ బాలడీయర్, ఉద్యమకారుడు.1987లో కారంచేడు దళితులహత్యలపై పోరాడిన గద్దర్ గారు నకిలీ ఎన్కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు.ఆ తరువాత
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో చేరి..
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గద్దర్ గారు.
అలాగే తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు గద్దర్. 1997
ఏప్రిల్ 6 వ తేదీన గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది.ఇక అమ్మ తెలంగాణమా ఇంకా పొడుస్తున్న పొద్దుమీద వంటి పాటలతో
తెలంగాణ ఉద్యమాలకు ఊపుతెచ్చారు గద్దర్. అలాగే నీ పాదం మీద పుట్టుమచ్చనై చల్లెమ్మా అనే.. పాటకు గాను ఆయనకీ నంది అవార్డు వచ్చింది.కాని ఆ నంది అవార్డును ఆయన తిరస్కరించారు గద్దర్.ఇక మాభూమి లో
వెండి తెరపై కనిపించారు
గద్దర్ గారు . జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో
గద్దర్ గారు కూడా ఒకరు. నిజామాబాద్, హైదరాబాద్‌లో ఆయన విద్యాభ్యాసం జరిగింది. 1975 వ సంవత్సరంలో కెనరాబ్యాంక్‌లో ఉద్యోగం చేశారు గద్దర్.