బ్రేకింగ్: పెళ్లి చేసుకోబోతున్న నాగ సౌర్య!

frame బ్రేకింగ్: పెళ్లి చేసుకోబోతున్న నాగ సౌర్య!

Purushottham Vinay
టాలీవుడ్  ప్రముఖ యంగ్  హీరో నాగ శౌర్య త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్  కి లవర్  బాయ్  హీరోగా బాగా పరిచయం అయ్యిన ఈ యువ హీరో రీసెంట్ గా దర్శకుడు అనీష్ కృష్ణ తో చేసిన కృష్ణ వ్రిందా విహారి అనే సినిమాతో అలరించాడు.ఇక గత కొన్నాళ్ల కిందటే  తన సినిమా ప్రమోషన్స్ లో తన పెళ్లి టాపిక్ రాగా దాటవేసిన సౌర్య ఇప్పుడు సైలెంట్ గా తన పెళ్లిని అనౌన్స్ చేసి  షాకిచ్చాడు.పూర్తి వివరాల్లోకి వెళితే తాను  అనూష అనే అమ్మాయిని వివాహం చేసుకోనున్నట్టు ప్రకటించాడు. నవంబర్ లోనే వీరి పెళ్లి జరిగిపోనుందట. ఇక ఈ 19, 20 తేదీలలో బెంగళూరులో  వీరి వివాహ వేడుకలు చాలా గ్రాండ్ గా జరగనున్నట్టుగా  అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.ఇక దీనిపై ఇప్పుడు ఓ కార్డు కూడా బయటకి రాగా ఈ న్యూస్ టాలీవుడ్ లో ఇప్పుడు తెగ వైరల్ గా మారింది. దీనితో ఈ వార్త తెలిసిన సినీ ప్రముఖులు ఇంకా అలాగే నెటిజన్స్ ఈ యువ నటుడికి కంగ్రాట్స్ చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: