Breaking : తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్!

Purushottham Vinay
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. కాసేపటి క్రితమే.. తెలంగాణ విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ ను రిలీజ్ చేసింది.ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం… ఏప్రిల్ నెల 6 వ తేదీ నుండి మే 28 వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి. అలాగే ఎంసెట్ పరీక్షల దరఖాస్తుకు జనరల్‌ అభ్యర్థులకు ఫీజు రూ.800 గా పేర్కొంది విద్యాశాఖ.అలాగే… ఎస్సీ ఇంకా అలాగే ఎస్టీలకు రూ.400 లను ఫిక్స్‌ చేసింది. అలాగే.. జులై 14,15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ ఎగ్జామ్ జరుగనున్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ విద్యాశాఖ.


జులై 18,19,20 తేదీల్లో ఎంసెట్ ఇంజనీరింగ్ టెస్ట్ జరుగనున్నట్లు ప్రకటన చేసింది.అటు ఈ సెట్ పరీక్షల నోటిఫికేషన్ కూడా రిలీజ్ అయింది. జులై 13 వ తేదీన ఎంట్రెన్స్ జరుగన్నట్లు స్పష్టం చేసింది తెలంగాణ విద్యాశాఖ. ఇక ఈ నోటిఫికేషన్‌ ప్రకారం.. ఏప్రిల్  నెల 6 నుండి జూన్ 8 వరకు కూడా ఆన్లైన్ దరఖాస్తులు జరుగనున్నాయి. ఈ క్రమంలో అధికారిక ప్రకటన చేసింది తెలంగాణ విద్యాశాఖ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: